Sree Vishnu : శ్రీ విష్ణు కొత్త సినిమా అనౌన్స్.. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి కథ.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..

శ్రీ విష్ణు తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు.(Sree Vishnu)

  • Published on- August 31, 2026 / 04:46 PM IST

Sree Vishnu

Sree Vishnu : వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర నిర్మాణంలో సన్నీ సంజయ్ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు. నేడు హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ అధినేత చినబాబు పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

ఈ గ్లింప్స్ లో.. చిన్నప్పట్నుంచి ఎన్నో కళలు కానీ కుటుంబ స్థోమత వల్ల మాములు కాలేజీల్లో చదివి, కుటుంబ బాధ్యత కోసం ఉద్యోగం చేసే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి కథ చూపించారు. ఈ సినిమా ఎన్నో కళలు కానీ కుటుంబ బాధ్యతల కోసం తలొంచిన మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవిత కథ అని తెలుస్తుంది. ఈసారి కామెడీ కాకుండా ఎమోషన్ తో శ్రీవిష్ణు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Also Read : Veta : చిరంజీవి సినిమా టైటిల్‌తో.. ఈటీవీ విన్ కొత్త సినిమా ఓపెనింగ్..

మీరు కూడా శ్రీవిష్ణు కొత్త సినిమా గ్లింప్స్ చూసేయండి..