శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’..

'శ్రీవిష్ణు' హీరోగా 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' చిత్రం ‘రాజ రాజ చోర’..

  • Publish Date - February 29, 2020 / 06:13 AM IST

‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం ‘రాజ రాజ చోర’..

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా.. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునయన కథానాయిక. హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. 

‘‘శ్రీ విష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది.  ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది’’ అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. 

తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేదరామన్, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కీర్తి చౌదరి, సహ నిర్మాత : వివేక్ కూచి భొట్ల, నిర్మాతలు : టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, రచన-దర్శకత్వం : హసిత్ గోలి.

 

See Also | ‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సేషనల్ 50 డేస్..

ట్రెండింగ్ వార్తలు