Sreeleela : అనాథ పిల్లలతో శ్రీలీల రాఖీ సెలబ్రేషన్స్.. సినిమాలతోనే కాదు మంచితనంతో కూడా ఫిదా చేస్తున్న శ్రీలీల..

తాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.

Sreeleela Celebrate Rakhi Festival with Cheers Foundation Orphans photos goes viral

Sreeleela : శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బాగా వినిపిస్తున్న పేరు. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క చదువుకుంటూ, మరో పక్క యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తుంది. ఇంత బిజీలో కూడా టైం కుదుర్చుకుని కొన్ని మంచి పనులకి సహాయం చేస్తుంది ఈ భామ.

శ్రీలీల ఎప్పట్నుంచో చీర్స్ ఫౌండేషన్ అనే ఓ అనాథాశ్రమానికి సపోర్ట్ గా నిలుస్తుంది. గతంలో కూడా ఈ అనాథాశ్రమంకు వెళ్లి అక్కడి పిల్లలతో గడిపిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఇంత చిన్న వయసులోనే సక్సెస్ తెచ్చుకొని ఇంకొంతమందికి సహాయపడుతుందని అంతా శ్రీలీలని అభినందించారు. ఈ చీర్స్ ఫౌండేషన్ కి ఎప్పుడు ఏం కావాలన్నా శ్రీలీల అందిస్తుంది.

తాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి పిల్లలకు రాఖీ కట్టి, వారికి స్వీట్స్ తినిపించి వారితో రాఖి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి పిల్లలు శ్రీలీలకు స్పెషల్ బహుమతులు గిఫ్ట్ గా ఇచ్చారు. వారితో గడిపిన ఆ క్షణాలని ఫొటోలుగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. రక్షాబంధన్ చీర్స్ ఫ్యామిలీతో జరుపుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Kichcha Sudeepa : కిచ్చ సుదీప్ – విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా సినిమా.. కబ్జా డైరెక్టర్‌తో..

దీంతో అనాథ పిల్లలతో శ్రీలీల రాఖీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందం, డ్యాన్స్, నటనతో ఇప్పటికే ప్రేక్షకులని ఫిదా చేసి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు ఇలా తన మంచితనంతో కూడా అందర్నీ మెప్పిస్తుంది. సూపర్, ఇలాగే మంచి పనులు చేయాలి, దేవుడు నిన్ను చల్లగా చూడాలి, శ్రీలీల చాలా మంచి అమ్మాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు.

ట్రెండింగ్ వార్తలు