Sreeleela : బాబోయ్.. నెలకొక సినిమా రిలీజ్ చేసిన శ్రీలీల.. నెక్స్ట్ ఏంటి మరి?
శ్రీలీల గత అయిదు నెలలుగా అయిదు సినిమాలతో వరుసగా నెలకొక సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది.
- Saketh U
- Published On : January 20, 2024 / 09:59 AM IST
Sreeleela Released Five movies from last five Months Audience Surprised
Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీలీల అని చెప్పేస్తారు అంతా. పెళ్ళిసందD సినిమాతో పలకరించి ధమాకా సినిమాతో తన దమ్ము చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. ఏకంగా చేతిలో పది ప్రాజెక్ట్స్ ని ఒకేసారి సంపాదించుకుంది. దీంతో గత సంవత్సరం తను చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజయ్యాయి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తునే మరో పక్క మరిన్ని ఆఫర్లు తెచ్చుకుంటుంది శ్రీలీల.
అయితే గత అయిదు నెలలుగా శ్రీలీల వరుసగా నెలకొక సినిమా రిలీజ్ చేసింది. దీంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. శ్రీలీల ఒప్పుకున్న సినిమాలన్నీ షూట్ అయి ఒకేసారి రిలీజ్ కి రావడంతో ఇలా నెలకొక సినిమా పడింది. 2022లో సెప్టెంబర్ లో రామ్ సరసన ‘స్కంద’ సినిమాతో వచ్చింది ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత అక్టోబర్ లో బాలయ్య కూతురిగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టింది. అనంతరం నవంబర్ లో వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’ సినిమాతో రాగా ఈ సినిమా పరాజయం పాలైంది. అనంతరం డిసెంబర్ లో నితిన్ సరసన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో రాగా ఇది కూడా పరాజయం పాలైంది.
ఇక జనవరిలో ఇటీవల సంక్రాతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించింది. ఇలా శ్రీలీల గత అయిదు నెలలుగా అయిదు సినిమాలతో వరుసగా నెలకొక సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. మళ్ళీ ఇప్పట్లో శ్రీలీల సినిమాలేవీ రిలీజ్ అయ్యేలా లేవనే చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తున్నా అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కానీ దాంట్లో శ్రీలీల తప్పుకుంది అని కూడా టాక్ నడుస్తుంది. పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నా ఆ సినిమా పక్కన పెట్టేసి డైరెక్టర్ హరీష్ ఇంకో సినిమా చేసుకుంటున్నాడు. దీంతో ఈ సంవత్సరం అసలు శ్రీలీల మళ్ళీ తెరపై కనిపించకపోవచ్చు అని సమాచారం.
Also Read : Ram Charan : రామ్ చరణ్ కార్‌ని వెంబడించిన ఫ్యాన్స్.. చరణ్ ఏం చేశాడో తెలుసా?
అలాగే శ్రీలీల ప్రస్తుతం MBBS చివరి దశలో ఉంది. దీంతో ఆ బిజీ కూడా అయిపోయాకే కొత్త సినిమాలు ఒప్పుకుంటుందని, షూటింగ్స్ కి హాజరవుతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం గ్యాప్ ఇచ్చినా ఆ తర్వాత వచ్చే సంవత్సరం నుండి ఫుల్ సినిమాలతో తెరపై సందడి చేస్తుందని శ్రీలీల అభిమానులు భావిస్తున్నారు.
