Sri Satya : శ్రీ సత్య హోస్ట్ గా.. కొత్త ఓటీటీ విహారి..
నవంబర్ లో ఈ ఓటిటి లాంచ్ కాబోతుంది. (Sri Satya)
- Saketh U
- Published on- October 12, 2026 / 03:44 PM IST
Sri Satya
Sri Satya : మా టీవీ లో మొదలైన విహారి ద ట్రావెలర్ షో ఇప్పుడు విహారి ఓటీటీగా రానుంది. ఏ ఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా,,దర్శకుడిగా ఈ యాప్ త్వరలో రానుంది. ఇప్పటికే టీవిలో ట్రావెల్ గైడ్ రిలేటెడ్ గా ఎన్నో వీడియోస్ చేసారు ఈ సంస్థ. యాంకర్ సుమతో కూడా త్వరలో కొన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయబోతుంది విహారి సంస్థ. ఇప్పుడు ఓటిటి హోస్ట్ గా శ్రీ సత్యని తీసుకున్నారు. తాజాగా ఈ ఓటీటీ అనౌన్స్ ఈవెంట్ నిర్వహించారు. నవంబర్ లో ఈ ఓటిటి లాంచ్ కాబోతుంది.
విహారి అధినేత ఏ ఎల్ నితిన్ మాట్లాడుతూ.. 2004లో విహారి మా టీవీలో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన కరుణ, పిజి వింద, స్నిగ్ధకి చాలా థాంక్స్. ఇప్పుడు ఓటిటి కి ఫేస్ ఆఫ్ ఎవరు అని ఆలోచిస్తే శ్రీ సత్య గుర్తొచ్చింది. నాకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న అందరు కొలాబరేట్స్ కి కృతజ్ఞతలు అని తెలిపారు.
Also Read : Nandamuri Balakrishna House: నందమూరి బాలకృష్ణ బిగ్ డిసిషన్.. రోడ్డు విస్తరణకు సెంటిమెంట్ నివాసం త్యాగం
నటి శ్రీ సత్య మాట్లాడుతూ.. ఇప్పటిదాకా హోస్ట్ గా నేను దేనికి చేయలేదు. ఫస్ట్ టైం హోస్ట్ అనగానే భయమేసింది కానీ నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు. ట్రావెల్ చేయడం అంటే మనకు మినిమం బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ మనం తిరిగే ప్లేసెస్ ఉన్నాయి అని అన్ని విషయాలని తెలియజేస్తుంది విహారి. విహారిలో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.
