Sri Vidya : డబ్బులిస్తే బిగ్ బాస్ కి వస్తాను.. పాచిపని చేయడానికి కూడా రెడీ.. జబర్దస్త్ నటి కామెంట్స్..

నటి శ్రీవిద్య కూడా బిగ్ బాస్ కి వెళ్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Sri Vidya)

  • Published on- November 16, 2026 / 07:14 PM IST

Sri Vidya

Sri Vidya : ఇటీవల బిగ్ బాస్ కి వెళ్ళడానికి చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు. ఛాన్స్ వస్తే వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 జరుగుతుంది. తాజాగా యాంకర్, జబర్దస్త్ ఫేమ్, నటి శ్రీవిద్య కూడా బిగ్ బాస్ కి వెళ్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ హిట్ అవ్వడంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది శ్రీ విద్య.

శ్రీవిద్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. డబ్బులిస్తే బిగ్ బాస్ కి వెళ్తాను. ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్ళను. అసలే హైదరాబాద్ లో రూమ్ రెంట్స్ పెరుగుతున్నాయి. నీళ్లు రావట్లేదు. ఒక్కోసారి చెయ్యి కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండట్లేదు. మినరల్ వాటర్ తో కడుక్కునే అంత రిచ్ నేను కాదు. బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా చూసి ఛాన్స్ ఇస్తే ఓ మూడు నెలలు అక్కడే పాచి పని, వంట పని చేసుకుంటూ అక్కడే పడి ఉంటాను అని తెలిపింది.

Also Read : Ramya Krishna : బాహుబలి రిజెక్ట్ చేశా.. ఐటెం సాంగ్స్ ఇష్టం.. పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్..

మరి ఈ కామెంట్స్ చూసి అయినా, లేదా సెలబ్రిటీ లిస్ట్ లో అయినా వచ్చే సీజన్ లో శ్రీ విద్యకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.