Mrithyunjay OTT: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్(Mrithyunjay OTT).

Sri Vishnu mrityunjay movie ott streaming update

Mrithyunjay OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్‌(Mrithyunjay OTT)’. శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్స్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు నెల రోజుల తరువాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Pragya Jaiswal: ఆ చూపు.. ఆ వయ్యారం.. ఎల్లో డ్రెస్సులో ప్రగ్యా హాట్ అండ్ క్యూట్ షో

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మృత్యుంజయ్‌’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చేసుతున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, థియేటర్స్ లో ఆశించిన ఫలితం దక్కించుకోని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.ఇక కథ విషయానికి వస్తే, ఒక మిస్టరీ కేసును ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.