Srikanth Odela : నాని అన్నతో గొడవలు.. నాని తిట్టింది నిజమే.. ప్యారడైజ్ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్..

ఈ వ్యాఖ్యలపై నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీట్ లో స్పందించాడు.(Srikanth Odela)

  • Published on- September 26, 2026 / 06:43 PM IST

Srikanth Odela

Srikanth Odela : దసరా సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెంటనే నానితోనే ప్యారడైజ్ సినిమా చేసాడు. దర్శకుడి మీద నమ్మకంతోనే నాని ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడికి, నానికి మధ్య గొడవలు జరిగాయి. దర్శకుడిని నాని కొట్టాడు, తిట్టాడు. దర్శకుడి వల్ల వేరే ఆర్టిస్టులు వెళ్ళిపోతే నాని బతిమాలి తీసుకొచ్చాడు.. ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి. దర్శకుడి కోపం, ఎక్కువ టెక్స్ చేయించడం వల్లే సినిమా కూడా లేట్ ఆయనని టాలీవుడ్ లో టాక్ నడించింది.

ఈ వ్యాఖ్యలపై నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీట్ లో స్పందించాడు.

Also Read : Bigg Boss Today Promo : నరేష్ ని అలా అన్నందుకు దేబ్జానీపై నాగార్జున ఫైర్.. బిగ్ బాస్ ఎమోషనల్ ప్రోమో..

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. నేను ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని వార్తలు చదివాను. నాని అన్న నన్ను తిట్టాడు, తన్నాడు, మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అని చదివాను. నేను కూడా అలిగాను, అరిచాను అని విన్నాను. అవన్నీ నిజాలే. నేను, అన్న వేరే సినిమాలు కూడా చేస్తానో లేదో తెలీదు. కానీ మా ఎమోషన్ సినిమాలో పెట్టలేను. సినిమా ఎమోషన్ వేరు. మా ఇద్దరి ఎమోషన్ వేరు. ఆయన నన్ను తీసుకొచ్చి పెట్టాడు. ఆయన నన్ను భరించాలి, నన్ను మోయాలి, సమస్యే లేదు ఆయన నన్ను భరించాల్సిందే. మేము తన్నుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం ఏడున్నా మా ఇద్దరి మధ్య ఎమోషన్ అది. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగవు. అది చావుని దాటి చూడాలి. అది నాని అన్నతో నా ఎమోషన్. అందుకే అన్నకు థ్యాంక్స్ కూడా అవసర్లేదు అని అన్నారు.