Srikanth Odela : ‘ది ప్యారడైజ్’ కథ చెప్పేసిన శ్రీకాంత్ ఓదెల.. పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది..

తాజాగా మొదటిసారి ది ప్యారడైజ్ సినిమా యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. (Srikanth Odela)

  • Updated on- September 11, 2026 / 06:19 PM IST

Srikanth Odela

Srikanth Odela : నాని ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఫైనల్ గా సెప్టెంబర్ 24 రాబోతుంది. తాజాగా మొదటిసారి ది ప్యారడైజ్ సినిమా యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ ప్రెస్ మీట్ లో ది ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చినా హిట్ చేస్తున్నారు. చాలా మందికి ఈ సినిమా ఏంటి, కథ ఏంటి అని సందేహాలు ఉన్నాయి. మీ అందరికి అర్ధమవ్వాలని చెప్తున్నాను. ఇది ఒక రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం, తల్లి కొడుకుల కథ, సవారీ జాతి కథ. కాలేజీ గారు చెప్పిన లైన్ ఒకటి ఉంటుంది. పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది. అలా దేశం కోసం పోరాడిన ఒక జాతిని దేశంలోనే సంబంధం లేదంటే వాళ్లందరికీ ఏం చేయాలో తెలియక మరలబడ్డ జాతి కథ. ఇది ఈ సినిమా బేసిక్ లైన్ అని తెలిపారు.

Also Read : Bigg Boss Today Promo 2: నిన్నే ఎలిమినేషన్.. మళ్ళీ ఇవాళ ఎలిమినేషన్.. షాకుల మీద షాకులు ఇస్తున్న బిగ్ బాస్..