Srinidhi Shetty : నాది తల్లి పాత్ర అయినా ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసాను.. ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి..
శ్రీనిధి శెట్టి నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకుంది. (Srinidhi Shetty)
- Saketh U
- Updated on- October 26, 2026 / 04:40 PM IST
Srinidhi Shetty
Srinidhi Shetty : వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనిధి శెట్టి నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి వెంకటేష్ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించబోతుంది.
ఈ సినిమాకు ఓకే చెప్పడానికి కారణం చెప్తూ.. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో కోరిక ఉంది. అలాంటిది ఆయన నుంచి పిలుపు రావడం సంతోషంగా అనిపించింది. త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఆయన సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ఆదర్శ కుటుంబం’ ఉంటుంది. అందుకే కథ వినగానే ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నాది అమ్మ పాత్ర అయినప్పటికీ సినిమాకి నో చెబుదామని ఆలోచన కూడా రాలేదు. వెంటనే ఓకే చెప్పేసాను. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి అని తెలిపింది.
Also Read : Zubeda Ali : అలీ భార్యకు హార్ట్ సర్జరీ.. ఏడ్చేసిన అలీ.. వీడియో వైరల్..
ఆదర్శ కుటుంబంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటిసారి కామెడీ పాత్ర చేశాను. కాస్త కష్టంగానే అనిపించింది. ఈ సినిమాలో నేను చిట్ ఫండ్ లో డబ్బులు పోగొడతాను. మొత్తం అప్పులు చేసేస్తాను. కొంత యాక్షన్ కూడా చేశాను. ఈ పాత్రలో నన్ను నేను చూసుకున్నాక సంతోషంగా అనిపించింది అని తెలిపారు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. త్రివిక్రమ్ గారి డైలాగుల్లో ఎంతో భావం ఉంటుంది. అందుకే ప్రతి డైలాగ్ నేను చెప్పేముందు దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాను. సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రైటింగ్ లో ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది. త్రివిక్రమ్ గారిని కలిసిన తర్వాత ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి కూడా తెలిసింది. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా వింటూ ఉండిపోతారో అర్థమైంది. సెట్ లో మంచి వాతావరణం ఉండేలా చూస్తారు. నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు ఆయన అని అన్నారు.
సినిమా రిలీజ్ వాయిదాలు పడటంపై స్పందిస్తూ.. ఒక సినిమాపై ఏడాదిన్నర కష్టపడి, అవుట్ పుట్ ను ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు కంగారుపడి విడుదల చేసే కంటే కాస్త ఆలస్యంగా రావడంలో తప్పులేదు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ అర్థమయ్యేలా చెప్పారు. మంచి అవుట్ పుట్ కోసమే సినిమా ఆలస్యం అయింది అని తెలిపారు. వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ గొప్పగా ఉంటుంది. ఆయనను మ్యాచ్ చేయడం సాధ్యం కాదు. కానీ నా వంతు ప్రయత్నించాను. త్రివిక్రమ్ గారి రైటింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ కలిస్తే కామెడీ సహజంగా ఉంటుంది. ఆ సహజత్వంలో నేను ఇమిడిపోయే ప్రయత్నం చేశాను. ఆయన జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చెప్తూ ఉంటారు అని తెలిపింది.
నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ గురించి మాట్లాడుతూ.. ఈ బ్యానర్ నటీనటులకు సపోర్టుగా నిలుస్తారు. ఏడాదికి పైగా సాగిన ఈ మూవీ ప్రయాణం ఎంతో బాగుంది. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. తన నెక్స్ట్ సినిమాల గురించి స్పందిస్తూ.. కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంకా ఫైనల్ అవ్వలేదు. బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అని తెలిపింది శ్రీనిధి శెట్టి.
