Zubeda Ali : అలీ భార్యకు హార్ట్ సర్జరీ.. ఏడ్చేసిన అలీ.. వీడియో వైరల్..
ఇటీవల నా హార్ట్ సర్జరీ జరిగింది అంటూ ఓ వీడియోని షేర్ చేసారు జుబేదా. (Zubeda Ali)
Zubeda Ali Health
Zubeda Ali : కమెడియన్ అలీ ఎన్నో సినిమాలతో నవ్వించారు. ఆయన భార్య జుబేదా కూడా కొంత కాలంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ, పలు టీవీ షోలకు హాజరవుతూ ఫేమ్ తెచ్చుకున్నారు. రెగ్యులర్ గా తను చేసే పనులు, అనేక విషయాలను జుబేదా అలీ యూట్యూబ్ లో వీడియో రూపంలో షేర్ చేస్తున్నారు. ఇటీవల నా హార్ట్ సర్జరీ జరిగింది అంటూ ఓ వీడియోని షేర్ చేసారు జుబేదా. అలాగే సోషల్ మీడియాలో తను సర్జరీకి వెళ్లేముందు అలీ ఏడ్చిన వీడియో కూడా షేర్ చేసారు.
ఈ వీడియోలో తన హార్ట్ సర్జరీ గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, హాస్పిటల్ కి వెళ్లడం, ఆపరేషన్ కి వెళ్లడం, ఆపరేషన్ అయ్యాక వార్డులో పడుకున్నప్పటి విషయాలు చూపించారు. జుబేదా ఆపరేషన్ కి వెళ్లేముందు అలీ ఎమోషనల్ అయ్యారు. తన భార్యకు జాగ్రత్తలు చెప్పారు.
Also Read : Kangana Ranaut : 17 ఏళ్ళ తర్వాత తెలుగు సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్ హీరోయిన్..? ఆ దర్శకుడితో సినిమా..
అలీ భార్య జుబేదాకు హార్ట్ లో స్టంట్ వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్జరీనే చేసినట్టు తన వీడియోలో తెలిపింది జుబేదా. ప్రస్తుతం ఆపరేషన్ పూర్తయి రెస్ట్ తీసుకుంటున్నారు అలీ భార్య. తన హార్ట్ సర్జరీ వీడియో షేర్ చేయడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అలీ అభిమానులు, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో అలీ ఏడుస్తున్న వీడియో షేర్ చేసి.. నన్ను ఇంతగా ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నా జీవితంలో లభించిన గొప్ప వరాల్లో ఒకటి. ఆయన నా పక్కన ఉండటం నిజంగా నా అదృష్టం. నా భర్తలాగే ప్రేమించే, అండగా నిలిచే భర్త ప్రతి మహిళకు దొరకాలని కోరుకుంటున్నాను. అలాంటి భర్త తోడుంటే ప్రతి మహిళ తన కలలను ధైర్యంగా నెరవేర్చుకోగలదు, ప్రేమతో, ఆనందంతో నిండిన జీవితాన్ని గడపగలదు అని పోస్ట్ చేసింది. దీంతో అలీ ఏడ్చిన వీడియో వైరల్ గా మారింది.
View this post on Instagram
