Srinivasa Mangapuram : ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించిన అభిమానులు..

మహేష్ బాబు సపోర్ట్ తో శ్రీనివాస మంగాపురం సినిమా ఈ సంవత్సరం జూలై 30న థియేటర్లలో రిలీజ్ అయింది. (Srinivasa Mangapuram)

  • Updated on- November 7, 2026 / 05:08 PM IST

Srinivasa Mangapuram

Srinivasa Mangapuram : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ ఇటీవల ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో వచ్చాడు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మాణంలో RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మోహన్ బాబు, కిక్ శ్యామ్, వాసుకి, నరేష్, బ్రహ్మాజీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

మహేష్ బాబు సపోర్ట్ తో శ్రీనివాస మంగాపురం సినిమా ఈ సంవత్సరం జూలై 30న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే రొటీన్ స్టోరీ కావడం, విజువల్స్ నాసిరకంగా ఉండటం, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడని కృష్ణ ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కానీ సినిమా బాగోకపోవడంతో నిరాశ చెందారు.

Also Read : Satya : వామ్మో.. సత్య ఒక్క రోజుకు రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు తీసుకుంటాడో తెలుసా?

అయితే హీరో సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు కూడా సైలెంట్ అయిపోతారు. కానీ కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ శ్రీనివాస మంగాపురం సినిమా ఫ్లాప్ అయినా వంద రోజులు ఆడించడం గమనార్హం. చిలకలూరి పేటలోని కృష్ణ, మహేష్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో కుటుంబం నుంచి వచ్చాడని జై కృష్ణకు సపోర్ట్ ఇవ్వాలని, ఏదో ఒక రికార్డ్ ఇవ్వాలని అక్కడి రామకృష్ణా థియేటర్ లో ఫ్లాప్ అయిన శ్రీనివాస మంగాపురం సినిమాను వంద రోజులు ఆడించారు.

అలా ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించి ఘట్టమనేని కుటుంబానికి తమ అభిమానం చాటుకున్నారు కృష్ణ, మహేష్ అభిమానులు. అయితే ఎంత అభిమానం ఉన్నా మరీ ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించడం ఎందుకు అని విమర్శలు కూడా వస్తున్నాయి. అదే చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్ లో గతంలో ఎంతో మంది హీరోల సినిమాలు వంద రోజులు, అంతకు మించి కూడా ఆడాయి. కృష్ణ, మహేష్ సినిమాలకు కూడా రికార్డ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి జై కృష్ణ చేరాడు. జై కృష్ణ కోసమే ఇంత చేసారంటే రేపు మహేష్ కొడుకు వస్తే ఆ సినిమా ఎలా ఉన్నా వంద రోజులు ఆడించేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది.