Srivalli Song : ‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేస్తోంది..
‘పుష్ప - ది రైజ్’ పార్ట్ 1 నుంచి రష్మిక ‘శ్రీవల్లి’ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది..
- sekhar
- Updated on- October 5, 2021 / 11:57 AM IST
Rashmika
Srivalli Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.
Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని.. పుష్ప రాజ్ అలాగే బన్వర్ సింగ్ షెఖావత్ కూడా షూటింగులో పాల్గొంటున్నారని సోమవారం ప్రకటించిన టీం, మంగళవారం ‘పుష్ప’ లోని సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చింది.
ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్
అక్టోబర్ 13న కథానాయిక రష్మిక క్యారెక్టర్ ‘శ్రీవల్లి’ లిరికల్ సాంగ్ ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ ‘పుష్ప – ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారు.
