Dasara Movie: దసరా టీమ్ పై బొమ్మ బొంబాట్ అంటూ జక్కన్న ప్రశంసల వర్షం
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ‘దసరా’ మూవీ పై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
- Anil Aaleti
- Updated on- April 3, 2023 / 04:10 PM IST
SS Rajamouli Congratulates Dasara Movie Team
Dasara Movie: నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తీర్చిదిద్దగా, ఈ సినిమాకు జనం పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్‌లు పూర్తి డీగ్లామర్ పాత్రల్లో నటించగా, వారి పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Dasara Collections : నాని దూకుడు మాములుగా లేదు.. 4 రోజుల్లో దసరా కలెక్షన్స్?
ఇక ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకుల దగ్గర్నుండీ సెలెబ్రిటీల వరకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి కథను తాము పూర్తిగా ఎంజాయ్ చేశామంటూ పలువురు సినీ సెలెబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి కూడా దసరా సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని ఆయన అన్నారు. పూర్తి రా అండ్ రగడ్ కథలోనూ ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రాధాన్యమిచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుందని.. నాని, కీర్తి సురేష్‌ల కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాలో కనిపించాయని ఆయన అన్నారు.
Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..
ప్రతి ఆర్టిస్టు తమ పాత్రల్లో జీవించారని.. సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా నిలిచిందని.. బీజీఎం నెక్ట్స్ లెవెల్‌లో ఉందని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు. ఇక దసరా టీమ్ అందరికీ ఇలాంటి విజయాన్ని అందుకున్నందుకు తన శుభాకాంక్షలు తెలిపాడు ఈ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్. ప్రస్తుతం దసరా మూవీపై రాజమౌళి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
