SSMB 28 : జనవరి నుంచి నాన్ స్టాప్‌గా మహేష్.. సమ్మర్ కి SSMB 28 సినిమా రెడీ అంటున్న నిర్మాత..

తాజాగా మహేష్ త్రివిక్రమ్ సినిమా తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ మహేష్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ట్వీట్ చేశారు. ఇటీవల మహేష్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ, తమన్.................

SSMB28 Shoot starts from january

SSMB 28 :  మహేష్ బాబుకి 2022 అస్సలు బాగోలేదు అనుకుంట. ఒకే సంవత్సరంలో మహేష్ తన అన్న, అమ్మ, నాన్నని పోగొట్టుకున్నారు. దీంతో మహేష్ పూర్తిగా విషాదంలో ఉన్నాడు. మహేష్ కి ఈ సంవత్సరం మంచి ఏదైనా జరిగింది అంటే అది సర్కారు వారి పాట సినిమా భారీ విజయం సాధించడమే. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసి షూట్ మొదలుపెట్టినా ఒక షెడ్యూల్ చేసి ఆపేశారు. మహేష్ బాధలో ఉండటంతో మళ్ళీ ఆ షూట్ మొదలవ్వలేదు.

తాజాగా మహేష్ త్రివిక్రమ్ సినిమా తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ మహేష్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ట్వీట్ చేశారు. ఇటీవల మహేష్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ, తమన్ దుబాయ్ కి వెళ్లగా అక్కడి ఫోటోలని షేర్ చేస్తూ.. సినిమా షూటింగ్ కి అంతా రెడీ అయిపొయింది. జనవరి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ కి వెళ్ళబోతున్నాం. మరిన్ని సూపర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. రెడీగా ఉండండి అని తెలిపారు.

Venky Atluri : సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్

దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జనవరిలో షూట్ మొదలుపెట్టి కంటిన్యూ షూట్ చేసి అనుకున్నట్టు సమ్మర్ కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.