Star Actor : నటరాజ స్వామిగా మారిన స్టార్ నటుడు.. ఒళ్ళంతా రంగు పూసుకొని.. ఎవరో గుర్తుపట్టారా?
ఇంతకీ ఈ నటుడు ఎవరు అనుకుంటున్నారా? (Star Actor)
- Saketh U
- Published On : February 15, 2026 / 02:32 PM IST
Star Actor
Star Actor : సినీ నటీనటులు తాము చేసే పాత్రలు, పర్ఫార్మెన్స్ ల కోసం ఎంతైనా కష్టపడతారు. తాజాగా ఓ నటుడు టీవీ షోలో తను చేసే పర్ఫార్మెన్స్ కోసం ఇలా నటరాజ స్వామిగా మారాడు. ఇందుకు చాలానే కష్టపడ్డాడు. తన నటరాజ స్వామి జర్నీని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇంతకీ ఈ నటుడు ఎవరు అనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫేమ్, స్టార్ సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి. మానస్ ప్రస్తుతం BB జోడి డ్యాన్స్ షోలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్ కోసం నటరాజులా మారి నాట్యం చేసాడు. ఇందుకోసం కదలకుండా కొన్ని గంటలు నిలబడి ఒళ్ళంతా రంగు పూసుకొని, చాలా కష్టపడి నటరాజులా మారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాడు. చివర్లో నటరాజు స్వామిలా అలరించాడు.
Also Read : Nagabandham Teaser: విజువల్ వండర్ గా నాగబంధం టీజర్.. విడుదల చేసిన మహేష్ బాబు
మానస్ నటరాజ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇతను మానస్ అని కూడా గుర్తుపట్టడం కష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. అంతలా పాత్ర కోసం మారిపోయి అందరికి షాకిచ్చాడు మానస్. అతని డెడికేషన్ కి ఫ్యాన్స్, నెటిజలు అభినందిస్తున్నారు.
మానస్ నటరాజ జర్నీ స్పెషల్ వీడియో మీరు కూడా చూసేయండి..
Also Read : Queen Glimpse: హీరోయిన్ గా యామినీ ఈఆర్.. ఆసక్తికరంగా “క్వీన్” టైటిల్ గ్లింప్స్
