Lokesh Kanagaraj: బ్యాంకు ఉద్యోగం వదిలేసి.. నిర్మాతలతో ఛీ కొట్టించుకొని.. లోకేష్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు

స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్(Lokesh Kanagaraj) గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికర విషయాలు.

Star Director Lokesh Kanagaraj success story

  • ఉద్యోగం వదిలేసి మరి ఇండస్ట్రీలోకి
  • ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ లోకేష్
  • చాలా మందికి ఇన్స్పిరేషన్

Lokesh Kanagaraj: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఎంతోమంది స్టార్ కిడ్స్ భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చి, రెండు మూడు సినిమాలకే కనుమరుగైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నేడు బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న వ్యక్తి లోకేష్ కనకరాజ్. టాలెంట్, కఠోర శ్రమ ఉంటె చాలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పరవాలేదు అని ఈ క్రేజీ డైరెక్టర్ నిరూపించారు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘నగరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు లోకేష్‌. అయితే ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా కలిసిరాలేదు. ఆ తర్వాత అవకాశాల కోసం ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి చోటా నిరాశే ఎదురైంది. చాలా ,మంది నిర్మాతలు ఆయన చెప్పిన కథలను ఛీ కొట్టారట. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా లోకేష్(Lokesh Kanagaraj) తలరాతను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.

KD Song: పాటలో అసభ్యత.. దర్శకుడు ఒత్తిడి వల్లే ఆ పదాలు రాశాను.. క్షమాపణలు చెప్పిన గీత రచయిత

ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆ తరువాత వచ్చిన సినిమా మేకింగ్ నే మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఒక్క హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు లోకేష్ పేరు చెబితేనే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతున్నాయి. ఇండియాలోని టాప్ సూపర్ స్టార్లు సైతం ఈయనతో ఒక్క సినిమా చేయడానికి క్యూ కడుతున్నారంటే, ఈ డైరెక్టర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సక్సెస్ వెనుక ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు.

లోకేష్ కనకరాజ్ సినిమాల్లోకి రాకముందు బ్యాంక్ ఉద్యోగిగా పని చేసేవారు. బ్యాంక్ జాబ్ అంటే సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి శాలరీ, జాబ్ సెక్యూరిటీ. కానీ, తన టాలెంట్‌ను నమ్ముకొని బ్యాంకు జాబ్ వదిలేసి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒకవేళ లోకేష్ ఇక్కడ విఫలమై ఉంటే, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్న వ్యక్తిగా మిగిలిపోయేవారు. కానీ ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడూ గౌరవిస్తారని లోకేష్ విషయంలో మరోసారి నిరూపితమైంది. నేడు తనదైన శైలిలో ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)ను సృష్టిస్తూ, అగ్ర దర్శకుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.