Ravi teja: రెమ్యునరేషన్ పూర్తిగా తగ్గించిన రవితేజ.. వామ్మో.. మరీ ఇంత తక్కువా?
వరుస ప్లాప్స్ తో తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకున్న రవి తేజ(Ravi Teja).
- V Santhosh Kumar
- Updated on- May 11, 2026 / 04:11 PM IST
star hero Ravi Teja has drastically reduced his remuneration
- రెమ్యూనరేషన్ తగ్గించిన రవితేజ
- వరుస ప్లాపులతో రవితేజ జాగ్రత్త నిర్ణయాలు
- ఇరుముడి సినిమాపైనే ఆశలన్నీ
Ravi teja: మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బలు తగలడంతో, తన తదుపరి చిత్రాల విషయంలో ఆయన ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తన రెమ్యూనరేషన్ విషయంలో గతంలో చాలా కఠినంగా ఉన్న రవితేజ, వరుస డిజాస్టర్ల నేపథ్యంలో ఇప్పుడు తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం.
Boyapati Srinu: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో బోయపాటి శ్రీను.. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరూ అగ్ర హీరోలతో బిజీగా ఉండటంతో, రవితేజ వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్లే ఆయనకు ప్రధాన ఆప్షన్‌గా మారుతున్నారు. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఒకప్పుడు రూ.25 కోట్ల రూపాయలు తీసుకున్న రవితేజ(Ravi teja), ఇప్పుడు రూ.15 కోట్లకు తన పారితోషికాన్ని పరిమితం చేసుకున్నారని తెలుస్తోంది. తనకు మళ్ళీ ఒక భారీ విజయం దక్కేవరకు నిర్మాతలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ‘ఇరుముడి’ అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజ కెరీర్ మళ్ళీ గాడిన పడాలన్నా, స్టార్ హీరోగా తన ఫామ్‌ను నిలబెట్టుకోవాలన్నా ఈ సినిమా విజయం అత్యంత కీలకం. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే మాస్ మహారాజా మళ్ళీ ఫామ్‌లోకి వస్తారు, లేదంటే ఆయన కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఈ ‘డిఫరెంట్ ట్రై’ పైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు.
