Pawan Kalyan Prabhas : పవన్ – ప్రభాస్ కాంబో నిజంగానే ప్లాన్ చేస్తున్నారా? OG సీక్వెలా లేదా వేరే కథా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో కలిసి త్వరలోనే మల్టీస్టారర్ సినిమా చేయాలని భావిస్తున్నారట. (Pawan Kalyan Prabhas)
- Saketh U
- Updated on- March 11, 2026 / 12:33 PM IST
Pawan Kalyan Prabhas
- పవన్ కళ్యాణ్ ప్రభాస్ కాంబోలో సినిమా
- ప్లాన్ చేస్తున్న నిర్మాత
- OG సీక్వెల్ చేస్తారా లేక వేరే కథ చేస్తారా
Pawan Kalyan Prabhas : ప్రముఖ తెలుగు సినిమా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోందట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో కలిసి త్వరలోనే మల్టీస్టారర్ సినిమా చేయాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఇద్దరూ క్లోజ్ అని తెలిసిందే. ఇప్పుడు పవన్ నిర్మాతగా కూడా పీపుల్ మీడియాతోనే సినిమాలు చేయబోతున్నాడు.
గతంలో పవన్ కల్యాణ్ పీపుల్ మీడియా నిర్మాణంలో బ్రో సినిమా చేసారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అడ్డంకులను విశ్వప్రసాద్ క్లియర్ చేసారు. దీంతో పీపుల్ మీడియా ప్రొడక్షన్ లో పవన్ ఒక సినిమా చేస్తాను అని కూడా చెప్పారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను పీపుల్ మీడియా రిలీజ్ చేసింది. ఇటీవల ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ తో నిర్మించింది. ఈ రెండు సినిమాలతో నష్టాలే వచ్చాయి. అందుకే ప్రభాస్ కూడా ఒక సినిమా చేస్తానని నిర్మాత చెప్పాడట.
Also Read : Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ ని టార్గెట్ చేసిన మహేష్ ఫ్యాన్స్.. సారీ చెప్పిన హరీష్ శంకర్..
దీంతో ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేసి నష్టాలు కవర్ చేసుకునే ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇద్దరు మాస్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవడం ఖాయం. ఇప్పటికే ఇంటర్నల్ డిస్కషన్స్ మొదలైనట్టు టాక్. పవన్, ప్రభాస్ కాంబినేషన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్ సినిమా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. పవర్ ఫుల్ స్టోరీ కోసం డైరెక్టర్స్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ మీటింగ్స్ పెడుతోందట.
అయితే ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ సాహో, OG సినిమాలను కలుపుతూ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించాడు. OG సీక్వెల్ లో ప్రభాస్ ఉండే ఛాన్స్ ఉందని, ఈ యూనివర్స్ లో ప్రభాస్ – పవన్ కలిసి నటించే అవకాశం ఉందని గతంలోనే హింట్ ఇచ్చాడు. మరి విశ్వప్రసాద్ సుజీత్ ని పట్టుకొని భారీగా ప్రభాస్ – పవన్ సినిమాని సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తారా లేక ఏదైనా కొత్త కథని, వేరే డైరెక్టర్ తో వీరిద్దరి కాంబోలో సినిమా ప్లాన్ చేస్తారా చూడాలి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం పాన్ ఇండియా వైడ్ పెద్ద హిట్ అవ్వడమే కాక బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవటం ఖాయం.
Also Read : Baladitya : రోజా అక్కతో బాగా ఆడుకునేవాడ్ని.. రోజా గురించి బాలాదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు..
