×
Ad

Sudheer Babu : పవన్ తో జానీ లాంటి సినిమా, మహేష్ ఖలేజా సినిమా చేస్తా అంటున్న సుధీర్ బాబు..

హంట్ సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం సాయంత్రం ట్విట్టర్ లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించాడు సుధీర్ బాబు. వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో...........

  • Published On : January 26, 2023 / 07:57 AM IST

Sudheer Babu comments on Pawan Kalyan and Mahesh Babu Movies

Sudheer Babu :  ట్యాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు మొదటి నుంచి కూడా కొత్తకొత్త సినిమాలని, కథలని ట్రై చేస్తున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందు ఉంటాడు. కాకపోతే హిట్స్ శాతం కొంచెం తక్కువే ఈ హీరోకి. సమ్మోహనం తర్వాత ఆ రేంజ్ హిట్ సుధీర్ కి మళ్ళీ పడలేదు. సుధీర్ గత సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

సుధీర్ బాబు ప్రస్తుతం హంట్ సినిమాతో వస్తున్నాడు. సుధీర్ బాబు, తమిళ్ హీరో భరత్, శ్రీకాంత్ కలిసి ఓ సరికొత్త పోలీస్ యాక్షన్ కథతో రాబోతున్నారు. ఈ సినిమాపై సుధీర్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా నేడు జనవరి 26న థియేటర్స్ లో రిలీజవుతుంది. గత వారం రోజులుగా సుధీర్ హంట్ సినిమా ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నాడు.

Pathaan Review : పఠాన్.. పాత కథకి సూపర్ యాక్షన్ సీన్స్ జోడింపు..

హంట్ సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం సాయంత్రం ట్విట్టర్ లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించాడు సుధీర్ బాబు. వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మహేష్ సినిమాలని రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమాని రీమేక్ చేస్తారు అని అడగగా సుధీర్ బాబు.. ఖలేజా, 1 నేనొక్కడ్నే సినిమాలు అయితే రీమేక్ చేస్తాను అని తెలిపాడు. అలాగే మరో నెటిజన్ మీరు దర్శకత్వం వైపు కూడా వెళదాం అనుకుంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమా తీస్తారు అని అడగగా సుధీర్ బాబు.. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. నాకు ఆయనతో సినిమా దర్శకత్వం వస్తే జానీ లాంటి మార్షల్ ఆర్ట్స్ టైప్ సినిమాని తెరకెక్కిస్తాను అని అన్నారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.