Maama Mascheendra : ఓటీటీలోకి సుధీర్ బాబు సినిమా..! థియేటర్‌లో ఉండగానే..?
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటారు.
- Thota Vamshi Kumar
- Published On : October 8, 2023 / 07:15 PM IST
Maama Mascheendra ott release
Maama Mascheendra ott release : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘మామా మశ్చీంద్రా’. నటుడు హర్షవర్థన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో నటించాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా ఉన్న పాత్రలో కనిపించారు.
ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటించగా అభినయ, అజయ్, హర్షవర్ధన్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఓటీటీ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ త్వరగానే ఈ సినిమా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందట.
Brahmaji : అతన్ని చూస్తే భయమేస్తుంది.. నేను రిటైర్ అయిపోతే బెటర్.. బ్రహ్మాజీ వ్యాఖ్యలు..
అయితే.. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సినిమా విడుదలైన రెండు వారాల్లో ఓటీటీలోకి వచ్చేసినట్లే.
#MaamaMascheendra from October 20. ? @PrimeVideoIN #MaamaMaschindra pic.twitter.com/Ptv3HhFio8
— SpreadFLIX (@spreadflix) October 8, 2023
