Sudheer Joker : సుడిగాలి సుధీర్ బర్త్ డే.. ‘సుధీర్ జోకర్’ గ్లింప్స్ రిలీజ్..

నేడు సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. (Sudheer Joker)

  • Published on- May 19, 2026 / 04:00 PM IST

Sudheer Joker

Sudheer Joker : సుడిగాలి సుధీర్ హీరోగా “సుధీర్ జోకర్” అనే కొత్త సినిమా రాబోతోంది. నేడు సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాణంలో పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

నేడు సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా “సుధీర్ జోకర్” సినిమా గ్లింప్స్ ని బ్యాంగర్ పేరుతో సుధీర్ అభిమానుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించి రిలీజ్ చేసారు. మీరు కూడా సుధీర్ జోకర్ బ్యాంగర్ చూసేయండి..

Also Read : Manchu Manoj : గదతో మాస్ లుక్‌లో మంచు మనోజ్.. బర్త్ డే స్పెషల్ ఫొటోలు..

ఈ బ్యాంగర్ చూస్తుంటే.. నగరంలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. ఓ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన యువకుడే దొంగ అని తెలుస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది ఆసక్తి కలిగిస్తోంది. సుధీర్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత విజయ్ డొంకాడ మాట్లాడుతూ.. పరదా సినిమా తర్వాత డైరెక్టర్ సునీల్ చెప్పిన ఈ కథ విని సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. సుధీర్ 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కష్టపడుతున్నాడు. సుధీర్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా ఉంటుంది ఈ సినిమా. 50 శాతం సినిమా పూర్తయింది అని తెలిపారు. డైరెక్టర్ పీఎస్ సునీల్ పుప్పాల మాట్లాడుతూ.. ఈ కథ ఓకే చేశాక సినిమాకు కావాల్సినంత బడ్జెట్ పెడతారా లేదా నిర్మాతలు అనుకున్నా కానీ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సుధీర్ అన్న ఇచ్చిన సపోర్ట్, కాన్ఫిడెన్స్ ను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓజీ సినిమా ఎలాగో సుధీర్ ఫ్యాన్స్ కు సుధీర్ జోకర్ సినిమా అలా అని అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. నా బర్త్ డేను కుటుంబ సభ్యులతో జరుపుకుంటాను. కానీ ఈ సారి మాత్రం నా కుటుంబ సభ్యులుగా మారిన ఫ్యాన్స్ తో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ బర్త్ డే చాలా స్పెషల్. కథ చెప్పినంత బాగా సినిమా చేస్తున్నారు. ఈ బ్యాంగర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే కాదు నా ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ కూడా అని అన్నారు.