Sudigali Sudheer : మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. ‘సర్కార్’లా ఆడించడానికి..

మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్. 'సర్కార్'లా ఆడించడానికి ఓటీటీలో..

Sudigali Sudheer re entry to hosting with Sarkaar Game Show

Sudigali Sudheer : బుల్లితెర పై స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్.. హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో బుల్లితెరకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసారు. అయితే బుల్లితెర అభిమానులంతా.. సుధీర్ ని మిస్ అవుతూ వస్తున్నారు. సుధీర్ మళ్ళీ ఎప్పుడు బుల్లితెర పై కనిపిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేస్తూ బుల్లితెర రీ ఎంట్రీకి సుధీర్ సిద్ధమయ్యారు.

అయితే ఈ రీ ఎంట్రీ టెలివిజన్ లో కాదు ఓటీటీలో ఉండబోతుంది. ఆహాలో ప్రసారమయ్యే ‘సర్కార్ గేమ్ షో’కి సుధీర్ హోస్టుగా చేస్తూ తన రీ ఎంట్రీని డిజైన్ చేసారు. ఈ సక్సెస్‌ఫుల్ గేమ్ షో నుంచి ఇప్పటికే మూడు సీజన్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ త్వరలో టెలికాస్ట్ కి సిద్దమవుతుంది. గతంలో ఈ షోకి ప్రదీప్ హోస్టుగా చేసారు. అయితే ప్రస్తుతం ప్రదీప్.. బుల్లితెరకు బ్రేక్ ఇచ్చేసారు.

Also read : Family Star : రిలీజ్‌కి ముందే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.. కళ్యాణి వచ్చా వచ్చా..

కారణం ఏంటనేది తెలియదు గాని, టీవీ అండ్ ఓటీటీలో తాను చేసే షోలు అన్నిటినుంచి ప్రదీప్ తప్పుకున్నారు. ప్రదీప్ కూడా తప్పుకోవడంతో.. బుల్లితెరకి మేల్ హోస్ట్‌లు కొరత ఏర్పడింది. దీంతో చేసేది లేక ఆహా టీం.. ‘సర్కార్ గేమ్ షో’ కోసం సుధీర్ ని మళ్ళీ తీసుకు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు సినిమాల్లో బిజీగా ఉన్న సుధీర్.. ఇప్పుడు రీ ఎంట్రీలో ఎలా అలరించబోతున్నారో చూడాలి.

ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ తో ‘పాగల్’ తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్యాచిలర్’తో మూవీ ఫేమ్ దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. త్వరలోనే సినిమాని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.

ట్రెండింగ్ వార్తలు