Family Star : రిలీజ్‌కి ముందే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.. కళ్యాణి వచ్చా వచ్చా..

బాలీవుడ్ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తూ రిలీజ్‌కి ముందే 'కళ్యాణి వచ్చా వచ్చా' ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.

Family Star : రిలీజ్‌కి ముందే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.. కళ్యాణి వచ్చా వచ్చా..

Kalyani Vaccha Vacchaa full video Song Released From Vijay Deverakonda The Family Star

Updated On : April 1, 2024 / 7:24 PM IST

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతగోవిందం’ దర్శకుడు పరుశురామ్ మరోసారి విజయ్ తో కలిసి ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ వారం రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్ ని రిలీజ్ చేసారు. ఈక్రమంలోనే మూవీ నుంచి రిలీజ్ చేసిన పెళ్లి సాంగ్ ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సూపర్ హిట్టుగా నిలిచింది.

అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోని మాత్రమే రిలీజ్ చేసారు. రిలీజ్ కి ముందు ఇలా లిరికల్ వీడియోని మాత్రమే రిలీజ్ చేయడం టాలీవుడ్ లోని ట్రెండ్, అయితే బాలీవుడ్ లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసేస్తారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తూ.. ‘కళ్యాణి వచ్చా వచ్చా’ ఫుల్ వీడియో సాంగ్ ని సినిమా రిలీజ్ కి ముందే రిలీజ్ చేసేసారు.

గీతగోవిందంకి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ పోటాకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. మంగ్లీ, కార్తీక్ పాడారు. మరి ఆ ఫుల్ వీడియో సాంగ్ ని మీరు కూడా చూసేయండి.

Also read : Adivi Sesh – Akira Nandan : అడివి శేష్, అకిరా ఇంత క్లోజ్ ఫ్రెండ్సా.. అకిరా కోసం పవన్‌కి నో..

కాగా ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతుంది. రెండు వారలు తరువాత హిందీ అండ్ మలయాళంలో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తారట. గీతగోవిందం కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతగోవిందం తరువాత మళ్ళీ అలాంటి హిట్ విజయ్ కి పడలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాతో ఒక గట్టి కమ్ బ్యాక్ ఆశిస్తున్నారు.