Sudigali Sudheer : 14 ఏళ్ళ ప్రేమ.. వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.. సుడిగాలి సుధీర్ బ్రేకప్ స్టోరీ తెలుసా?

మరోసారి తన ప్రేమ గురించి సర్కార్ షోలో తెలిపాడు సుధీర్. (Sudigali Sudheer)

  • Published On : April 6, 2026 / 09:04 PM IST

Sudigali Sudheer

Sudigali Sudheer : మ్యాజిక్ షోలు చేసుకుంటూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బుల్లితెర స్టార్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ట్యాలెంట్ తో ఎంతోమందిని మెప్పించి బాగా సక్సెస్ అయ్యాడు సుధీర్. అయితే సుధీర్ ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు.

గతంలో సుధీర్ తన ప్రేమ గురించి ఓ షోలో చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన ప్రేమ గురించి సర్కార్ షోలో తెలిపాడు సుధీర్.

Also Read : Niharika : టీవీ షోలో నిహారిక సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి.. గర్ల్స్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇంకేం చేసేదానివో..

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ 14 ఏళ్ళు రిలేషన్ షిప్. స్కూల్ నుంచే పరిచయం, ప్రేమ. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాను. తను వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంది అని తెలిసింది. ఎందుకు అని అడిగాను. నేను హ్యాపీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అంది. ఇంక దాంతో ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. నక్లెస్ రోడ్ లో పరిగెత్తాను ఆ రోజు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

గతంలో కూడా తన ప్రేమ గురించి స్పందిస్తూ.. తను ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఏంటో నాకు తెలీదు. కానీ డిప్రెషన్ లోకి వెళ్లినా ఆ సమయంలో నా మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కాబట్టే నేను వర్క్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నాను. తను ఆ రోజు బ్రేకప్ చెప్పకపోతే ఇవాళ నేను ఇంత సక్సెస్ అవ్వలేను ఏమో. ఇవాళ ఇంతమంది ప్రేమ పొందుతున్నందుకు తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు.

Also Read : Varanasi : ఇక్కడేమో ఫ్యాన్స్ వెయిటింగ్.. అక్కడేమో ‘వారణాసి’కి సమ్మర్ హాలిడేస్..