×
Ad

Hey Balwanth Review : ‘హే బల్‌వంత్‌’ మూవీ రివ్యూ.. ఇంతకీ ఏం బిజినెస్ తెలుసా?

సినిమా మొదలుపెట్టడమే బల్‌వంత్ బిజినెస్ ఏంటో చెప్పేయడంతో మొదట్లోనే ప్రేక్షకులు షాక్ అవుతారు. (Hey Balwanth Review)

  • Published On : February 19, 2026 / 11:34 PM IST

Hey Balwanth Review

Hey Balwanth Review : సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా ‘హే బల్‌వంత్‌’. త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మాణంలో గోపీ అచ్చర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్, యాంకర్ స్రవంతి, సుదర్శన్, వెన్నెల కిషోర్.. పలువురు కీలకపాత్రలు పోషించారు. వరుసగా హిట్స్ అందుకుంటున్న వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. హే బల్‌వంత్‌ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Hey Balwanth Review)

కథ విషయానికొస్తే..

కృష్ణ(సుహాస్) తండ్రి రామ్ బల్‌వంత్(నరేష్) ఓ బిజినెస్ చేస్తుంటాడు. కృష్ణ తన తండ్రి ఏం చేస్తాడో తెలియక పెద్ద బిజినెస్ మెన్ అని, తను కూడా పెద్దయ్యాక తండ్రి బిజినెస్ టేకోవర్ చేస్తానని చిన్నప్పటినుంచే ఫిక్స్ అవుతాడు. కృష్ణ చదువు అయ్యాక బిజినెస్ టేకోవర్ చేద్దామని వస్తే బల్‌వంత్ నో అంటాడు. తన తండ్రికి తన ట్యాలెంట్ చూపించాలని ఓ NGO నడుపుతున్న మిత్ర(శివాని నగరం) దగ్గర బిజినెస్ కన్సల్టెంట్ గా చేరి ఆమెతో ప్రేమలో పడతాడు. బల్‌వంత్ కి సడెన్ గా గుండెపోటు వచ్చి హాస్పిటల్ పాలవడంతో బిజినెస్ టేకోవర్ చేద్దామని వెళ్లి షాక్ అవుతాడు కృష్ణ.

ఆ బిజినెస్ ఏంటో తెలుసుకున్న కృష్ణ తండ్రిని అసహ్యించుకుంటాడు. అసలు బల్‌వంత్ చేసే బిజినెస్ ఏంటి? మిత్రకి ఈ బిజినెస్ గురించి తెలిసి ఏం చేస్తుంది? మధ్యలో దుర్గారావు(అజయ్ ఘోష్) – PVP (హర్షవర్ధన్) రాజకీయ గోల ఏంటి? చంప(యాంకర్ స్రవంతి) – యువన్(వెన్నెల కిషోర్) కథేంటి? తండ్రికి మళ్ళీ కృష్ణ దగ్గరవుతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Peddi : పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా? చరణ్ రేంజ్ కి ఇది తక్కువే అంటున్న ఫ్యాన్స్..

సినిమా విశ్లేషణ..

ముందునుంచి ఈ సినిమాలో నరేష్ చేసే బిజినెస్ ఏంటో కనిపెట్టండి అంటూ ప్రమోషన్స్ బాగా చేయడం, చివర్లో సెన్సార్ వాళ్ళు హే భగవాన్ టైటిల్ మార్చమనడంతో అది హే బల్‌వంత్ గా మారి సినిమాపై మంచి హైప్ వచ్చింది. సినిమా మొదలుపెట్టడమే బల్‌వంత్ బిజినెస్ ఏంటో చెప్పేయడంతో మొదట్లోనే ప్రేక్షకులు షాక్ అవుతారు.

ఇక ఆ బిజినెస్ ఏంటో తెలియకుండా కృష్ణ మాట్లాడే మాటలు, చేసే చేష్టలతో మనకు నవ్వొస్తుంది. పక్కనే ఉండి పంచులతో ఫుల్ గా నవ్విస్తాడు బంక(సుదర్శన్). అలా ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడా నవ్విస్తూ, ప్రేమకథతో పాటు చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చి బాగానే నడిపించారు. ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి అందరిని ఫుల్ గా నవ్విస్తారు. కానీ ఆ ట్విస్ట్ ఊహించేయొచ్చు.

ఇక సెకండ్ హాఫ్ అంతా కృష్ణ, బల్‌వంత్, మిత్ర, బంక, చంప, ఇంకొంతమంది అంతా కలిసి ఓ పొలిటీషియన్ ఇంటికి వెళ్లి చేసే హంగామా, అక్కడ జరిగే సీన్స్ తో ఫుల్ గా నవ్వుకుంటాం. చివర్లో మళ్ళీ అసలు బల్‌వంత్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటూ ట్విస్టులు రివీల్ చేస్తూనే తండ్రి ఎమోషన్ ని చూపించారు. సినిమా అంతా ఫుల్ గా నవ్వించి చివర్లో కాస్త ఎమోషన్ చేసారు.

సినిమాలో డబల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో చూపించిన బిజినెస్ ఎన్ని రీజన్స్ చెప్పినా అది పాజిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. తండ్రి ఎమోషన్ ఇంకాస్త బెటర్ గా చుపించాల్సింది అనిపిస్తుంది. ఎమోషన్ అంతగా పండలేదు. ఈ బిజినెస్ తెలిస్తే ఏమవుతుంది అనే టెన్షన్ కామెడీని మాత్రం బాగా రాసుకున్నారు. ఫ్యామిలీతో వెళ్తే కష్టమే. కానీ సరదాగా నవ్వుకోడానికి అయితే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లొచ్చు. ఆ బిజినెస్ ఏంటో థియేటర్ లో చూస్తేనే బెటర్.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సుహాస్ నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. హే బల్‌వంత్ లో టెన్షన్ పడే కుర్రాడిగా కామెడీతో బాగానే మెప్పించాడు. శివాని నగరం క్యూట్ గా కనిపిస్తూనే అక్కడక్కడా నవ్వించింది. సుదర్శన్ సినిమా అంతా ఫుల్ గా నవ్విస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న నరేష్ అక్కడక్కడా నవ్వించి చివర్లో ఎమోషనల్ చేస్తారు. ఓ సీన్ లో అందరి హీరోలని స్పూఫ్ చేసి అదరగొట్టారు నరేష్.

యాంకర్ స్రవంతి నటిగా బాగానే నటించింది. వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్విస్తాడు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. బాబు మోహన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

Also See : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు – కనపడుటలేదు’ ట్రైలర్ రిలీజ్.. కొత్త వెబ్ సిరీస్ ఎందులో? ఎప్పట్నించి?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు యావరేజ్. కొత్త కథ తీసుకొని ఆసక్తికర స్క్రీన్ ప్లే తో పంచ్ డైలాగ్స్ తో బాగా రాసుకొని మొదటి సినిమా అయినా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నిర్మాణ పరంగా ఈ సినిమా తక్కువ లొకేషన్స్ లోనే బాగానే ఖర్చుపెట్టి తెరకెక్కించారు.

మొత్తంగా ‘హే బల్‌వంత్’ తండ్రి ఎమోషన్ తో ఉన్న ఓ కామెడీ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.