Sukrithi Ambati : తొమ్మిదేళ్ల తరువాత మళ్ళీ కనిపించిన నటి.. నూకరాజు కోసం భావన..
తొమ్మిదేళ్ల తరువాత మళ్ళీ కనిపించిన నటి. మార్కెట్ మహాలక్ష్మి కోసం నూకరాజు చేస్తున్న ప్రయత్నానికి భావన హెల్ప్ చేయనుంది.
- gum 95921
- Published On : March 9, 2024 / 08:15 PM IST
Sukrithi Ambati was came back after 9 years for Parvateesam Market Mahalakshmi Movie
Sukrithi Ambati : కొంతమంది నటీనటులు మొదటి సినిమాతోనే ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. కానీ వచ్చిన ఆ ఫేమ్ ని పక్కన పెట్టేసి.. ఒకటి రెండు సినిమాలతో మాయమైపోతుంటారు. అలా ఒక సినిమాలో నటించి కనిపించకుండా మాయమైపోయిన నటి ‘సుకృతి అంబటి’. దిల్ రాజు నిర్మాణంలో 2015లో ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కేరంత’.
సుమంత్ అశ్విన్, పార్వతీశం, విస్వంత్, శ్రీదివ్య, సుకృతి, తేజస్వి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నూకరాజు పాత్ర ప్రతిఒక్కరిని బాగా ఎంటర్టైన్ చేసింది. నూకరాజు పాత్రని పార్వతీశం పోషించగా.. తనకి జోడిగా భావన పాత్రలో సుకృతి కనిపించింది. మూవీలో వీరిద్దరి ట్రాక్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
Also read : Salman Khan : సల్మాన్ ఖాన్ సీక్రెట్స్ బయటపెట్టిన చిన్ననాటి స్నేహితుడు..
ఈ చిత్రం తరువాత మరో సినిమాలో నటించని సుకృతి.. పెళ్లి జీవితాన్ని స్టార్ట్ చేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తుంది. ఇక ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సుకృతి.. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఆడియన్స్ కి కనిపించారు. తనతో పాటు కేరింత సినిమాలో నటించిన, తన స్నేహితుడు పార్వతీశం కొత్త సినిమా ప్రమోషన్ కోసం సుకృతి తిరిగి వచ్చారు.
పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్ గా కొత్త దర్శకుడు వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఇటీవల ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మార్చి 11న ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ గ్యాప్ లో కూడా ఈ సినిమాని ఆడియన్స్ లో నిలపాలని.. పార్వతీశం తన స్నేహితురాలు సుకృతిని రంగంలోకి దించారు. మళ్ళీ భావన అంటూ నూకరాజు పాత్రని గుర్తు చేశారు. ఆ ప్రమోషన్ వీడియోని మీరుకూడా చూసేయండి.
