×
Ad

Arya : ‘ఆర్య’ సినిమాకు అల్లు అర్జున్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

ఆర్య సినిమాకి అల్లు అర్జున్ కంటే ముందు వేరే హీరోలని అనుకున్నారని మీకు తెలుసా?

  • Published On : May 7, 2024 / 11:11 AM IST

Sukumar Allu Arjun Arya Movie Before Starting Interesting Story

Arya : అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, అను మెహతా హీరోయిన్ గా, శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో సుకుమార్(Sukumar) డెబ్యూట్ దర్శకత్వలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో వచ్చిన సినిమా ఆర్య. 7 మే 2004లో ఆర్య సినిమా రిలీజయి అప్పట్లోనే 30 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. ఇప్పటికి ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.

ఆర్య సినిమా వచ్చి నేటికి 20 ఏళ్ళు అవడం గమనార్హం. ఇప్పటికే అల్లు అర్జున్ దీనిపై ఓ పోస్ట్ కూడా చేసాడు. నేడు ఆర్య మూవీ యూనిట్ రీ యూనియన్ కూడా జరగనుంది. అయితే ఆర్య సినిమాకి అల్లు అర్జున్ కంటే ముందు వేరే హీరోలని అనుకున్నారని మీకు తెలుసా?

Also Read : Arya 20 Years : 20 ఏళ్ళ ‘ఆర్య’ రీ యూనియన్ స్పెషల్ పార్టీ.. బన్నీ, సుకుమార్, దిల్ రాజుతో సహా మూవీ యూనిట్ అంతా..

సుకుమార్ దిల్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాడు. దిల్ హిట్ అయితే సుకుమార్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని, కథ రెడీ చేసుకోమని దిల్ రాజు చెప్పాడట. దీంతో ఆర్య కథని అల్లరి నరేష్ ని దృష్టిలో పెట్టుకొని రాసారంట సుకుమార్. కానీ అది అల్లరి నరేష్ దాకా వెళ్ళలేదు. ఆ తర్వాత ఆర్య సినిమాకు రవితేజ, ప్రభాస్, నితిన్ అనుకున్నారట. కథని వాళ్ళకి వినిపించారు కూడా. కాకపోతే కథ వాళ్లకి సూట్ కాదని రిజెక్ట్ చేసారంట. దీంతో అల్లు అర్జున్ ని అనుకోని వెళ్లి ఈ కథ చెప్పడంతో బన్నీ ఓకే చేసాడు. దీంతో ఆర్య కథ ముందుకెళ్లింది. ఇక ఆర్య ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఎంత మంచి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.