Waltair Veerayya : చిరు డైరెక్షన్లో ‘బాస్ పార్టీ’కి స్టెప్పులేస్తున్న సుకుమార్, దేవిశ్రీ ..
'వాల్తేరు వీరయ్య' అంటూ మాస్ జాతర మొదలుపెట్టి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు చిరు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మూవీలోని మొదటి పాటని కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. 'బాస్ పార్టీ' అంటూ సాగే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ అందుకొని యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. తాజాగా ఈ పాటకి చిరు డైరెక్షన్లో..
- gum 95921
- Published on- December 16, 2022 / 12:48 PM IST
Sukumar and Devisri are stepping into 'Boss Party' under the direction of Chiru
Waltair Veerayya : చిరంజీవి చాలా కాలం తరువాత ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ అంటూ మాస్ జాతర మొదలుపెట్టి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ఇద్దరు మాస్ కథానాయకులు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య కొత్త పోస్టర్ ఊర మాస్.. పూనకాలు లోడింగ్!
కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మూవీలోని మొదటి పాటని కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ‘బాస్ పార్టీ’ అంటూ సాగే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ అందుకొని యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. తాజాగా ఈ పాటకి చిరు డైరెక్షన్లో.. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు బాబీ, మైత్రి నిర్మాతలు డాన్స్ చేసి సందడి చేస్తున్నారు.
అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ.. ‘మీ గ్యాంగ్‌తో మీరు చేసిన బాస్ పార్టీ మాతో షేర్ చేసుకోండి’ అంటూ కామెంట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో చిరుకి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. మొన్ననే వీరిద్దరిపై ఫ్రాన్స్ లో ఒక సాంగ్ ని చిత్రీకరించగా, త్వరలోనే ఆ పాటని విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు చిరు. అయితే అంతకుముందే ఆ సాంగ్ కి సంబంధించిన ఒక చిన్న బిట్ ని లీక్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు.
