RC 17 : స్క్రిప్ట్ రెడీ.. నవంబర్ నుంచి యాక్షన్ షురూ.!

పెద్ది తర్వాత కాస్త రిలాక్స్ అయిన రామ్‌చరణ్ ఇక నెక్స్ట్ ప్రాజెక్టుపై (RC 17) ఫోకస్ పెట్టాడట.

Sukumar and Ram Charan Movie shooting may starts from november

RC 17 : పెద్ది తర్వాత కాస్త రిలాక్స్ అయిన రామ్‌చరణ్..ఇక నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడట. డైరెక్టర్‌ సుకుమార్‌తో రామ్‌చరణ్ చేయబోయే RC17 మూవీ త్వరలోనే ట్రాక్ ఎక్కబోతున్నట్లు టాక్. రంగస్థలం తర్వాత చెర్రీ, సుక్కు కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో హాట్ టాక్ మొదలైంది. స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయ్యిందని, మైత్రి మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోందట. ట్విస్ట్ ఏంటంటే ఈ సారి సుకుమార్ పూర్తిగా కొత్త జానర్‌లో..చరణ్‌ను కొత్త లుక్‌లో చూపించబోతున్నాడట. పెద్ది మంచి వసూళ్లు సాధించినా పాన్ ఇండియా లెవెల్‌లో అనుకున్న నేమ్‌, ఫేమ్‌ను తెచ్చిపెట్టలేదని భావిస్తున్నారట. అందుకే RC17 ని పూర్తిగా నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తున్నారట.

Anasuya Bharadwaj : ఆరు గ‌జాల చీర‌.. శ‌తాబ్దాల ఆత్మ‌విశ్వాసం.. చీర‌క‌ట్టులో అన‌సూయ లేటెస్టు ఫోటోలు వైర‌ల్‌

కథ, క్యారెక్టర్, మేకింగ్, ఆల్ లెవెల్స్‌లో రిస్క్ తీసుకునేందుకు చరణ్ రెడీ అయ్యాడట. ఈ సినిమా చరణ్ కెరీర్‌ను మరో మెట్టెక్కించేలా ఉంటుందన్న గాసిప్స్ బయలుదేరాయి. RC 17 సినిమా కథ పూర్తిగా అడవి జీవితం చుట్టూ తిరగడమే కాదు..రియలిస్టిక్, రా టోన్‌లో ఉండబోతుందని అంటున్నారు. ఈ మూవీలో చరణ్ పాత్ర కూడా పూర్తిగా డిఫరెంట్‌గా..అడవిలో పుట్టి, అడవిలోనే పెరిగి, ప్రకృతితో కలిసి బ్రతికే ఓ అడవి మనిషి లాంటి క్యారెక్టర్‌లో కనిపిస్తాడని టాక్.