×
Ad

Tollywood: సుకుమార్ శిష్యులా మజాకా.. కంటెంట్ తో కుమ్మేస్తున్నారు.. ముగ్గురూ ముగ్గురే

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు.

Sukumar assistant directors are ruling Tollywood industry

  • టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల హవా
  • మూడు సినిమాల కంటెంట్ తో సోషల్ మీడియా షేక్
  • ఈ ముగ్గురిలో ఎవరు విజేత అవుతారు?

Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కంటెంట్ అండ్ కమర్షియల్ సినిమాలు చేయడంలో ఆయన టాప్. అయితే, కేవలం సుకుమార్ మాత్రమే కాదు ఇప్పుడు ఆయన శిష్యులు కూడా కంటెంట్ తో కుమ్మేస్తున్నారు. ఒకరు కాదు ఏకంగా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ముగ్గురు దర్శకుడు తన లేటెస్ట్ సినిమాలతో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. రీసెంట్ గా ఈ ముగ్గురు దర్శకుల సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ రికార్డ్ వ్యూస్ సాధిస్తూ తమ తమ సినిమాలపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వాటిలో ముందుగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేస్తున్న (Tollywood)ది పారడైజ్ సినిమా గురించి చెప్పుకోవాలి. నాని హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఆయా షేర్ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది అనే చెప్పాలి. అనిరుద్ అందించిన మ్యూజిక్ కి శ్రీకాంత్ టేకింగ్ నెక్స్ట్ లెవల్ ల్లో వర్క్అవుట్ అయ్యింది.

Shanmukh Jaswanth: బ్రేకప్ తరువాత చాలా ఏడ్చాను.. నేను బెస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను.. షణ్ముఖ్ ఎమోషనల్ కామెంట్స్

దాంతో, నెట్టింట ఎక్కడ చూసిన ఈ సాంగ్ గురించే చర్చ నడుస్తోంది. ఇక, ఆ తరువాత వచ్చిన అప్డేట్ దర్శకుడు బుచ్చిబాబు సన నుంచి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రయ్ రయ్ రారా అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధిస్తోంది. మొటివేషనల్ లిరిక్స్ తో వచ్చిన ఈ పాటలో చరణ్ చేసిన డాన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక మరో దర్శకుడు కార్తీక్ దండు. ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్న సినిమా వృషకర్మ. పీరియాడికల్ హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో చూపించిన విజువల్స్ కి ఆడియన్ మైండ్ బ్లాంక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదిరిపోయే కంటెంట్ వచ్చిన ఈ టీజర్ వృషకర్మ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. అలా ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ముగ్గురు దర్శకుల నుంచి వచ్చిన కంటెంట్ మాత్రమే కనిపిస్తోంది. ఆ విషయంలో సుకుమార్ శిష్యులా మాజాకా అనే లెవల్లో దుమ్ములేపుతున్నారు ఈ దర్శకులు. మరి ఈ మూడు సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.