Sukriti Veni : సుకుమార్ కూతురు సుకృతి వేణి సాధించిన మరో ఘనత.. అమెరికా మ్యూజిక్‌ స్కూల్‌ నుంచి..

సుకృతి సింగర్ గా తన ప్రయాణం కొనసాగిస్తోంది. (Sukriti Veni)

  • Published on- August 13, 2026 / 10:10 AM IST

Sukriti Veni

Sukriti Veni : స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఇప్పటికే గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి అందర్నీ మెప్పించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సుకృతి ఇప్పుడు సింగర్ గా తన ప్రయాణం కొనసాగిస్తోంది.

ఇటీవల సౌత్ కొరియా కు కూడా వెళ్లి ఓ కాన్సర్ట్ లో మెయిన్ సింగర్ గా పెర్ఫార్మ్ చేసింది సుకృతి. ఆ కాన్సర్ట్ లో ఇంగ్లీష్ సాంగ్ తో హాలీవుడ్ స్టైల్ సింగింగ్ తో సుకృతి చాలా బాగా పాడింది. తాజాగా సుకృతి వేణి అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డుకు ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

Also Read : Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ చేతిలో తెలుగు సినిమాలు లేవా? అసలే ఫ్లాప్స్..

బోస్టన్ లోని బెర్కెలీ కాలేజీ అఫ్ మ్యూజిక్ లో వచ్చే ఏడాది సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం ఫుల్ స్కాలర్షిప్ కు సుకృతి వేణి అర్హత సాధించింది. ఈ స్కాలర్షిప్ కోసం మొత్తం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. అందులో కూడా సింగెర్స్ విభాగంలో పూర్తి స్కాలర్షిప్ పొందిన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం. దీంతో మరోసారి సుకుమార్ కూతుర్ని అంతా అభినందిస్తున్నారు.