sukumar doing his next movie with ntr
Ntr- Sukumar: సుకుమార్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా వరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఈ దర్శకుడు పుష్ప 2 తరువాత ఇంటర్నేషనల్ లెవల్ కి ఎదిగాడు. కమర్షియల్ సినిమాలు తీయడంలో ఈ దర్శకుడు టాప్. అందుకే సుకుమార్ తో సినిమాలు చేసేందుకు పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. కానీ, ఈ దర్శకుడు మాత్రం తెలుగు హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నాడు.
అయితే, పుష్ప 2 తరువాత సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, దర్శకుడు సుకుమార్ చేయబోతున్న నెక్స్ట్ సినిమాల గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, సుకుమార్(Ntr- Sukumar) మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ మాస్ కథను సిద్ధం చేశాడట. ఇటీవలే ఆ కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడట.
manjusha rampalli: చీరలో టాలీవుడ్ యాంకర్ మంజూష.. ఒక్కొక్క స్టిల్ నెక్స్ట్ లెవల్ అంతే.. ఫొటోస్
ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడట. రంగస్థలం మాదిరి ఇది ఒక పీరియాడిక్ విలేజ్ సబ్జెక్టు అని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ కూడా చాలా కాలంగా రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కథనే ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశాడట సుకుమార్. ఇక ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు అని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్- సుకుమార్ కాంబోలో ఇప్పటికే నాన్నకు ప్రేమతో అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అదే రేంజ్ లో ఈ సినిమాలో కూడా సరికొత్త అవతారంలో కనిపిస్తాడట ఎన్టీఆర్. మరి సుకుమార్- ఎన్టీఆర్ కాంబోలో రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.