RC 17 : రంగస్థలంకు మించిన మాస్ కథతో సుకుమార్, చరణ్ మూవీ
చరణ్, సుక్కు కాంబినేషన్లో రాబోతున్న RC17పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 15, 2026 / 09:31 AM IST
Sukumar Ram Charan RC17 Movie Update
RC 17 : సుకుమార్ మార్క్ క్రియేటివిటీనే వేరు. ఆయన సినిమా మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్. హీరో క్యారెక్టరైజేషన్..మూవీ స్టోరీ..విజువలైజేషన్ అంతా పక్కాగా దించేస్తుంటారు సుక్కు. రంగస్థలం అయినా, పుష్ప అయినా..హీరో రోల్ నుంచి..సినిమా బ్యాక్ డ్రాప్ వరకు అంత మాస్. ఈ నేపథ్యంలో చరణ్, సుక్కు కాంబినేషన్లో రాబోతున్న RC17పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి.
రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలను మించి..పవర్ఫుల్ హై..మాస్ కథను సుకుమార్ సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ను గతంలో ఎన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నారనే టాక్ మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథ, క్యారెక్టరైజేషన్, ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లతో సుకుమార్ తనదైన మార్క్‌తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారా.? అనే చర్చ మొదలైంది.
Pooja Hegde : బుట్టబొమ్మ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే..
RC17 ఆఫీస్ ప్రారంభం కావడంతో సినిమా పనులు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. లాంచింగ్ ప్రొగ్రామ్ తర్వాత మూవీ పనులు అధికారికంగా మొదలయ్యే ఛాన్సుంది. అయితే పూజా కార్యక్రమం తేదీ, ప్రీపొడక్షన్, సినిమా టైటిల్ లాంచ్‌పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. RC17తో రామ్ చరణ్, సుకుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.
