Suma Kanakala
Suma Kanakala : సుమ కనకాల తెలుగువారికి బాగా సుపరిచితమైన యాంకర్. తన మాటలతో టీవీ షోలలో, సినిమా ఈవెంట్స్ లో అందర్నీ కట్టిపడేసి మెప్పిస్తుంది. అనేక టీవీ షోలతో తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది సుమ కనకాల. 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందంతో, అదే ఎనర్జీ తో అందర్నీ మెప్పిస్తుంది.
సుమ అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించి ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. సుమ భర్త రాజీవ్ కనకాల నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇక సుమ కొడుకు రోషన్ కనకాల ఇటీవలే హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సుమ కూతురు మనస్విని ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Balakrishna Srikanth : బాలయ్య – సౌందర్య కలిసి చేసిన ఒకే ఒక్క సినిమా.. పోటీకొచ్చి హిట్ కొట్టిన శ్రీకాంత్..
నిన్న జరిగిన అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కి సుమ తన కూతురు మనస్వినితో కలిసి హాజరైంది. కొత్త జంట అల్లు శిరీష్ – నయనిక తో కలిసి ఫోటో దిగారు. అలాగే అక్కడికి వచ్చిన పలువురు సుమతో ఫోటోలు దిగారు. దీంతో సుమ, తన కూతురు మనస్విని తో కలిసి కనిపించింది. గతంలో మనస్విని చిన్నపిల్లగా ఉన్నప్పుడు పలు ఫోటోలు షేర్ చేసింది సుమ. రీసెంట్ టైమ్స్ లో మనస్విని బయట కనిపించడం ఇదే.
దీంతో సుమ కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ప్రస్తుతం మనస్విని చదువుకుంటుంది. మరి సుమ కూతురు మనస్విని ఇంట్లో అందరిలాగే సినీ, టీవీ పరిశ్రమలోకి వస్తుందా లేక వేరే కెరీర్ చేసుకుంటుందా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
Also Read : Allu Arjun : మలయాళం దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. అయితే ఆ వార్తలు నిజమేనా?