Sumalatha : సూర్యుడు ఉన్నంతకాలం మీరు నాలో ఉంటారు.. భర్తని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సీనియర్ హీరోయిన్..

అంబరీష్ మరణం తర్వాత ఆయన స్థానంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు సుమలత. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తన భర్త అంబరీష్ ని తలుచుకుంటూ పలు పోస్టులు పెడతారు. తాజాగా అంబరీష్ తో తన వివాహం జరిగి 31 సంవత్సరాలు కావడంతో భర్తని తలుచుకుంటూ.................

Sumalatha :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నారు. ఒకప్పటి కన్నడ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు అంబరీష్ ని సుమలత ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1991 లో వీరి వివాహం జరిగింది. 2018 లో అంబరీష్ అనారోగ్య కారణాలతో మరణించారు. అంబరీష్ మరణం కన్నడ సినీ పరిశ్రమకి, కర్ణాటకకు ఎంతో లోటుని ఏర్పరిచింది.

అంబరీష్ మరణం తర్వాత ఆయన స్థానంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు సుమలత. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తన భర్త అంబరీష్ ని తలుచుకుంటూ పలు పోస్టులు పెడతారు. తాజాగా అంబరీష్ తో తన వివాహం జరిగి 31 సంవత్సరాలు కావడంతో భర్తని తలుచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Sayaji Shinde : షాయాజీ షిండే నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన నిర్మాత..

సుమలత తన పోస్ట్ లో.. ”మీ వాయిస్ ని నేను ప్రతి రోజూ వింటూనే ఉంటాను, మీ స్పర్శ నన్ను రోజూ తగులుతూనే ఉంది, మీరు రోజూ నన్ను చూస్తూనే ఉన్నారన్న భావనలో ఉన్నాను. మీరు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. మీరు మరణించి ఉండొచ్చు కానీ నాలోనే ఉన్నారు. సూర్యుడు ఉన్నంత కాలం, గాలి వీచినంత కాలం, వర్షాలు కురుస్తున్నత కాలం మీరు నాతోనే, నాలోనే ఉంటారు. 31 సంవత్సరాలు, జీవిత జ్ఞాపకాలతో, ప్రేమతో ఉన్నాను” అంటూ ఎమోషనల్ అయింది.

ట్రెండింగ్ వార్తలు