Sayaji Shinde : షాయాజీ షిండే నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన నిర్మాత..

మరాఠీ చిత్ర నిర్మాత సచిన్ ససన్ చేసిన ఫిర్యాదులో.. ''నా సినిమాలో షాయాజీ షిండే నటిస్తానని ఒప్పుకొని అయిదు లక్షలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు. నవంబర్ 25, 26 డేట్స్ లో షూటింగ్ కూడా..........

Sayaji Shinde : షాయాజీ షిండే నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన నిర్మాత..

marathi producer complaints on Sayaji Shinde

Sayaji Shinde :  తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో చాలా ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు షాయాజీ షిండే. ఒకప్పుడు చాలా పాపులర్, ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. తాజాగా నటుడు షాయాజీ షిండే తనని మోసం చేశాడంటూ ఓ మరాఠి నిర్మాత మరాఠి ఫిలిం ఫెడరేషన్ లో ఫిర్యాదు చేశాడు.

మరాఠీ చిత్ర నిర్మాత సచిన్ ససన్ చేసిన ఫిర్యాదులో.. ”నా సినిమాలో షాయాజీ షిండే నటిస్తానని ఒప్పుకొని అయిదు లక్షలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు. నవంబర్ 25, 26 డేట్స్ లో షూటింగ్ కూడా పెట్టుకున్నాం. ఆ డేట్స్ లో వస్తాను అని చెప్పారు. కానీ రాలేదు. 27వ తేదీన వచ్చి స్క్రిప్ట్ మార్చమని అడిగాడు, నేను నో చెప్పడంతో షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అతని వల్ల సినిమా షూట్ ఆగిపోయింది. సినిమా ఆగడం వల్ల, మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేయడం వల్ల నాకు 12 లక్షల నష్టం వచ్చింది. అతన్ని సినిమా క్యాన్సిల్ చేసుకొని రెమ్యునరేషన్ ఐదు లక్షలు తిరిగి ఇమ్మంటే సమాధానం చెప్పట్లేదు. ఫోన్స్ లిఫ్ట్ చెయ్యట్లేదు. అతని నుంచి మొత్తం నా నష్టం 17 లక్షలు ఇప్పించాలి” అని తెలిపాడు.

C Kalyan : షూటింగ్స్ బంద్ వల్ల ఎవరికీ లాభం లేదు..

అయితే దీనిపై షాయాజీ షిండే ఇంకా స్పందించలేదు. మరి మరాఠి ఫిలిం ఫెడరేషన్ షాయాజీ షిండేపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.