×
Ad

Suman : ఆదిపురుష్ సినిమాపై సుమన్ ఫైర్.. ఇలా వేరే మతం మీద తీయగలరా..?

తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అయ్యాడు. (Suman)

Suman

Suman : ప్రభాస్ రాముడిగా వచ్చిన ఆదిపురుష్ సినిమాపై చాలా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణంను ఇష్టమొచ్చినట్టు మార్చేశారని, గ్రాఫిక్స్ విషయంలో కూడా వరస్ట్ అని, రావణుడి పాత్రపైనా కూడా.. చాలా విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ టీజర్ రిలీజయినప్పటి నుంచే ఆ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికే అనేకమంది ఆదిపురుష్ సినిమాని విమర్శిస్తూ కామెంట్స్ చేసారు.(Suman)

తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అయ్యాడు. సుమన్ నేడు 10 టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇటీవల పురాణాలను మార్చేసి సినిమాల్లో కథను, పాత్రలను నచ్చినట్టు మారుస్తున్నారు అనే ప్రశ్న అడగ్గా సుమన్ స్పందించారు.

Also Read : Suman : నవీన్ గెలుపు పై సుమన్ కామెంట్స్.. శ్రీశైలం యాదవ్ నాకు క్లోజ్ ఫ్రెండ్.. నా కోసం 4 లారీల్లో జనాల్ని పంపి..

సుమన్ మాట్లాడుతూ.. చరిత్రని, పురాణాలను మార్చేస్తున్నారు. అడిగేవాళ్ళు లేరు. అది కరెక్ట్ కాదు. ఎవరన్నా దీనిపై కోర్టుకు వెళ్ళాలి. ఇటీవల ఆదిపురుష్ సినిమా తీశారు. అది కరెక్ట్ కాదు. రావణాసురుడు గెటప్ అది కాదు. అందులో లెదర్ జాకెట్ వేసుకొని ఏదోలా చూపించారు. రాముడుకి మీసాలు పెట్టారు. అసలు వాళ్ళు ఎలా యాక్ట్ చేసారో తెలీదు. అందరూ ఆ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేసారు కానీ ఎవరూ సినిమాని ఆపలేదు.

హిందూఇజం డెవలప్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి అనేవాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పురాణాలు మార్చేస్తారు. ఇదే వేరే మతం మీద తీయమనడండి.. థియేటర్ తగలబెట్టేవాళ్ళు. ఎందుకంటే హిందువులు కాబట్టి సైలెంట్ గా ఉంటారు అని అన్నారు. దీంతో సుమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Nagarjuna : వామ్మో.. నాగార్జునకు లంచ్ లో రోజూ ఆ కర్రీ ఉండాల్సిందే.. ఎక్కువ మందికి అది ఇష్టం ఉండదు..