Seetha Kalyana Vaibhogame Teaser : ‘సీతా కళ్యాణ వైభోగమే’ టీజర్ రిలీజ్.. విలేజ్ లవ్ స్టోరీతో..
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ టీజర్ రిలీజ్. విలేజ్ లవ్ స్టోరీతో..
- gum 95921
- Published On : April 19, 2024 / 09:03 PM IST
Suman Tej Garima Seetha Kalyana Vaibhogame Teaser released
Seetha Kalyana Vaibhogame Teaser : విలేజ్ లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని ఎప్పుడు ఆకట్టుకుంటూనే వస్తాయి. తాజాగా ఇప్పుడు అదే తరహాలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ సినిమా రాబోతుంది. సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ టీజర్ ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఒక చిన్న టీజర్ తో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పేసారు. అందమైన ప్రేమ కథ, యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ తో టీజర్ అదిరిపోయింది. సీత కోసం రావణుడి పై రాముడి చేసిన యుద్దాన్ని.. పల్లెటూరి ప్రేమ కథతో చూపించబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఈ టీజర్ రిలీజ్ చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేసారు.
Also read : Varun Sandesh : రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా వరుణ్ సందేశ్ కొత్త సినిమా.. ‘నింద’ పోస్టర్ రిలీజ్..
డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
