Sundeep Kishan : సమ్మర్‌లో సందీప్ కిషన్ ‘వైబ్’.. మసూద టీంతో..
సందీప్ కిషన్ ఇటీవలే 'ఊరిపేరు భైరవకోన' అనే సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి విజయం సాధించాడు. తాజాగా తన 31వ సినిమాని నేడు ప్రకటించాడు.
- Saketh U
- Published on- March 30, 2024 / 12:44 PM IST
Sundeep Kishan Announce his 31st Movie Vibe Poster goes Viral
Sundeep Kishan : సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరిపేరు భైరవకోన’ అనే సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత తన 30వ సినిమా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రకటించాడు. తాజాగా తన 31వ సినిమాని నేడు ప్రకటించాడు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా నేడు ప్రకటించారు మూవీ యూనిట్.
మళ్ళీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద.. లాంటి హిట్ సినిమాలు నిర్మించిన స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ RSJ దర్శకత్వంలో సందీప్ కిషన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘వైబ్'(Vibe). 2025 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రకటించారు మూవీ యూనిట్.
Also Read : Anita : ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ‘నువ్వు నేను’ భామ..
ఇక ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ.. మనం చాలా మందిని కలుస్తాము, కొంతమందిని ,మర్చిపోతాం, కొంతమందిని గుర్తుంచుకుంటాం, కొంతమంది కోసం మాత్రమే పోరాడతాం. కొంతమంది స్నేహితులు మాత్రం నీ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు అంటూ రాసుకొచ్చారు. ఫుల్ లెంగ్త్ ఫ్రెండ్షిప్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా వైబ్ ఉండబోతుందని సమాచారం.
