Anita : ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ‘నువ్వు నేను’ భామ..

'నువ్వు నేను' హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.

Anita : ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ‘నువ్వు నేను’ భామ..

Nuvvu Nenu Actress Anita Hassanandani Re Entry With Suhas Oh Bhama Ayyo Rama Movie

Updated On : March 30, 2024 / 12:48 PM IST

Anita Hassanandani : యువ హీరో సుహాస్(Suhas) ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హీరో అయ్యాడు. కొత్త కొత్త కథలతో పాటు నటుడిగా కూడా ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. హీరోగా మరిన్ని సినిమాలు సుహాస్ చేతిలో ఉన్నాయి. త్వరలో ఏప్రిల్, మే రెండు నెలల్లో రెండు సినిమాలు సుహాస్ నుంచి రాబోతున్నాయి. తాజాగా సుహాస్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. టైటిల్ కూడా ప్రకటించారు.

సుహాస్ 8వ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ సూపర్ హిట్ సినిమా జోయ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది. ఈ సినిమా కొత్త దర్శకుడు రామ్ గోడల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by V Arts (@vartsfilms)

Also Read : Anita Hassanandani : ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత.. ఇప్పుడు ఎలా ఉందో చూసారా?

నువ్వు నేను సినిమాతో తెలుగులో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిత ఆ తర్వాత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, రగడ.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. తెలుగులో సినిమాలు తగ్గించినా వేరే భాషల్లో అడపాదడపా సినిమాలు, టీవీ షోలు చేస్తుంది. చివరగా తెలుగులో 2016లో మనలో ఒకడు సినిమాలో నటించింది అనిత. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే నువ్వు నేను సినిమా రీ రిలీజ్ చేయడం గమనార్హం. మరి తెలుగులో రీ ఎంట్రీతో అనిత ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Nuvvu Nenu Actress Anita Hassanandani Re Entry With Suhas Oh Bhama Ayyo Rama Movie