Sundeep Kishan : మీమర్‌పై సందీప్ కిషన్ ఆగ్రహం.. హీరోయిన్స్ గురించి మరి అంత చీప్‌గా..
మీమర్ పై సందీప్ కిషన్ ఆగ్రహం. వద్దని చెప్పినా వినకుండా హీరోయిన్స్ గురించి పదేపదే అదే ప్రశ్న..
- gum 95921
- Updated on- February 24, 2024 / 04:13 PM IST
Sundeep Kishan fires on memer at Ooru Peru Bhairavakona movie event
Sundeep Kishan : సినిమాలు వల్ల యువత చెడిపోతున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ.. ఫిలిం ఇండస్ట్రీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే సినిమాలు చెడగొడుతున్నాయి అనే మాట పక్కనబెడితే.. ఈమధ్య కాలంలో పబ్లిక్ ప్రెస్ మీట్స్ కూడా యువతని పక్కదారి పట్టిస్తున్నాయి. మూవీ ప్రెస్ మీట్స్ కి వెళ్తున్న మీడియా విలేకర్లు సైతం.. హీరోయిన్స్ ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విజ్ఞతని కూడా కోల్పోయి ప్రశ్నలు వేస్తున్నారు.
ఇక ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, వాటినే యువత (సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్) కూడా అనుసరిస్తూ ట్రెండ్ చేస్తూ వస్తున్నారు. ఒక భాద్యత గల విలేకరే, డబుల్ మీనింగ్ లో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అదే ఫాలో అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈక్రమంలోనే రీసెంట్ గా సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ టీం.. మీమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వగా చేదు అనుభవం ఎదురైంది.
ఈ ఇంటరాక్షన్‌లో ఓ మీమార్ సందీప్ కిషన్‌తో.. ‘మీరు హీరోయిన్‌తో అలా చేశారు కదా. మీరు ఎలా చేశారని నాకు క్యూరియోసిటీగా ఉంది’ అంటూ ప్రశ్నించాడు. దానికి సందీప్ కిషన్ సమాధానం ఇవ్వనున్నారు. దీంతో ఆ మీమార్ రెండో క్వశ్చన్ అడిగాడు. ‘మీరు ఇద్దరి హీరోయిన్స్ తో చేశారు కదా ఎవరితో బాగా అనిపించింది’ అంటూ ప్రశ్నించాడు. దానికి సందీప్ రియాక్ట్ అవుతూ.. “నీ మాత్రం భాష తెలుగే కదా. ఆ హీరోయిన్స్ తో చేశారు అనడం కంటే ఆ హీరోయిన్స్ నటించారు అనడం కరెక్ట్ అని నీకు తెలియదా” అంటూ నిలదీస్తూ ఇద్దరి హీరోయిన్స్ తో నటించడం బాగానే ఉందని చెప్పుకొచ్చారు.
దీనికి ఆ మీమర్ రియాక్ట్ అవుతూ.. “అంటే ఇద్దరితో కలిసి బాగా ఎంజాయ్ చేసారా” అంటూ డబల్ మీనింగ్ లో మాట్లాడాడు. ఇక సహనం కోల్పోయిన సందీప్ కిషన్.. తమ్ముడు నువ్వు మాట్లాడుతుంది తప్పు పద్ధతి. అది నువ్వు ఎవరినో చూసి ఫాలో అవ్వడం లేదా వాళ్ళు అలా అన్నారని నువ్వు మాట్లాడడం లాంటివి మానుకో. ఎందుకంటే.. స్టేజి పై ఆడవాళ్లు ఉన్నారు. మనం వాళ్ళని గౌరవించాలి” అంటూ అతనికి బుద్ధి చెప్పారు.
Also read : Allu Ayaan : షారుఖ్ ఖాన్ పాటని అల్లు అర్జున్ కొడుకు.. ఎంత బాగా పాడుతున్నాడో చూడండి..
ప్రస్తుతం తెలుగు సినిమాలకు వరల్డ్ వైడ్ గా ఎంతో పేరు లభిస్తుంది. కానీ ఇక్కడ ఏంటిరా అంటే.. ప్రెస్ మీట్స్ లో హీరోయిన్స్ తో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా చేస్తున్నారు. ఈ పద్ధతి ఎప్పటికైనా తెలుగు వారికి చెడ్డ పేరు తీసుకు వస్తుంది. ఇప్పటికైనా కొంచెం గౌరవంగా, భాద్యతగా వ్యవరిస్తూ ప్రెస్ మీట్స్ లో మార్పు వస్తే బాగుంటుంది.
