Allu Ayaan : షారుఖ్ ఖాన్ పాటని అల్లు అర్జున్ కొడుకు.. ఎంత బాగా పాడుతున్నాడో చూడండి..
అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ప్రస్తుతం సోషల్ మీడియా మోడల్ అయ్యిపోయాడు. తాజాగా ఈ అల్లు వారసుడు షారుఖ్ ఖాన్ పాటని పడుతూ కనిపించాడు.

Allu Arjun son Allu Ayaan singing Shah Rukh Khan Dunki song video gone viral
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు. తను చేసే చిలిపి పనులకు అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు. ఇక అయాన్ అల్లరికి అభిమానుల అయిన టాలీవుడ్ అభిమానులు.. అయాన్‌ని ‘మోడల్’ అంటూ ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేసారు.
ఆడియన్స్ మాత్రమే కాదు, ఇటీవల అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్‌తో.. మోడల్ అయాన్ అంటూ మాట్లాడడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమాలోని ‘లుటు పుటు గయా’ పాటని.. ఆ వీడియోలో అల్లు అయాన్ పడుతూ కనిపిస్తున్నాడు.
Also read : Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ అప్పుడే.. ఈసారైనా పక్కానా?
ఈ పాటని కూడా తన అల్లరిలో భాగంగానే చేసినా.. సాంగ్ ని మాత్రం బాగానే పాడాడు అనిపించుకుంటున్నాడు. ఇది చూసిన నెటిజెన్స్.. మోడల్ అయాన్ బొల్తే అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్.. మీ డాడీ పాట పాడొచ్చు కదా అంటూ కోరుతున్నారు. మరి అల్లు వారసుడు పాడిన ఆ పాటని మీరు కూడా చూసేయండి.
Lut putt gaya #AlluAyaan version ? @iamsrk
#AlluArjun? pic.twitter.com/gWWRAsPG2z— EPIC _Tweetz?? (@saytruth93) February 24, 2024
ఇక కొంతమంది ఫ్యాన్స్ ఏమో.. ఈ వీడియోని షారుఖ్ ఖాన్ తో ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మరి ఈ వీడియో షారుఖ్ వరకు వెళ్లి ఆయన రెస్పాండ్ అవుతాడేమో చూడాలి. ప్రస్తుతం అయితే అల్లు అయాన్ సోషల్ మీడియా మోడల్ అయ్యిపోతున్నాడు.