Sundeep Kishan: జాసన్ సంజయ్ కూడా అచ్చు విజయ్ లాగే.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan: విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న హీరో సందీప్ కిషన్ (Jason Sanjay).

Sundeep kishan interesting comments on vijay thalapathy son jason sanjay

  • విజయ్ వారసుడిపై సందీప్ ప్రశంసలు.
  • జూలై 31న ‘సిగ్మా’ విడుదల.
  • జాసన్ సంజయ్ వినయం అద్భుతం.

Sundeep Kishan: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన ‘సిగ్మా’ అనే హై-స్టేక్స్ హీస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

*Anna Lezhneva: అత్తమ్మ, భర్తతో అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం ఫ్యామిలీ పిక్స్

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) దర్శకుడు జాసన్ సంజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌కు సినిమాపై ఉన్న నిబద్ధత, కష్టపడే తత్వం తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్‌కు వెళ్లడానికి ముందే కథ, ప్రీ-ప్రొడక్షన్, ఎడిటింగ్ వర్క్‌లపై సంజయ్ అండ్ టీమ్ పక్కా హోమ్‌వర్క్ చేసి పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగారని సందీప్ ప్రశంసించారు.

కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే అంత ప్రశాంతతతో, ఓపికతో క్లారిటీగా డైరెక్షన్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని సందీప్ కిషన్ అన్నారు. చూడటానికి సంజయ్ సరిగ్గా వాళ్ళ నాన్న విజయ్ లాగే ఉంటాడని పేర్కొన్నారు. అంతటి భారీ స్టార్ వారసుడైనప్పటికీ, సంజయ్‌లో ఉన్న వినయం, ఎంతో ఒదిగి ఉండే మనస్తత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని సందీప్ కొనియాడారు. మరి జాసన్ చేస్తున్న ఈ మొదటి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.