Gadar 2 : బాలీవుడ్‌లో మరో భారీ హిట్.. 400 కోట్లు కలెక్ట్ చేసిన సన్నీ డియోల్ గదర్ 2..

ఆగస్టు 11న థియేటర్స్ లో రిలీజయిన గదర్ 2 సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఎవరూ ఊహించనంతగా గదర్ 2 సినిమా మంచి విజయం సాధించింది.

Sunny Deol Gadar 2 Movie collects almost 400 crores in just two weeks

Gadar 2 Collections : గత మూడేళ్ళుగా ఫ్లాప్స్ తో గడిపేసిన బాలీవుడ్(Bollywood) కి ఇప్పుడిప్పుడే అడపాదడపా హిట్స్ వస్తున్నాయి. ఇటీవల సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 వచ్చింది. అమీషా పటేల్(Ameesha Patel) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాకిస్థాన్- ఇండియా బోర్డర్ కథతో పాటు ఓ ప్రేమకథని కూడా కలిపి ఎమోషనల్ గా తెరకెక్కించారు.

ఆగస్టు 11న థియేటర్స్ లో రిలీజయిన గదర్ 2 సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఎవరూ ఊహించనంతగా గదర్ 2 సినిమా మంచి విజయం సాధించింది. గదర్ 2 సినిమా తాజాగా 400 కోట్ల క్లబ్ లోకి చేరింది. గదర్ 2 సినిమా కేవలం రెండు వారాల్లోపే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని 100 కోట్లతో తెరక్కించగా ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. దీంతో బాలీవుడ్ కి మరింత జోష్ వచ్చింది. ఈ విజయంపై గదర్ 2 చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. త్వరలోనే ఈ వీకెండ్ తో గదర్ 2 సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని భావిస్తున్నారు.

Kantara : కాంతార బడ్జెట్ ఏమో 20 కోట్లు.. ప్రీక్వెల్‌కి మాత్రం ఇంత హెవీ బడ్జెట్? కాంతార 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

మరి బాలీవుడ్ ఈ హిట్స్ ని ఇలాగే కంటిన్యూ చేస్తారేమో చూడాలి. త్వరలో సెప్టెంబర్ లో మరో భారీ సినిమా షారుఖ్ జవాన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పఠాన్ ని మించి హిట్ అవుతుందని భావిస్తున్నారు బాలీవుడ్.

ట్రెండింగ్ వార్తలు