×
Ad

Sunny Leone : పోర్న్ ఇండస్ట్రీ నుంచి కాన్స్ వరకు.. గర్వంగా ఉందన్న సన్నీలియోన్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సన్నీ భర్త..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ జంటగా తెరకెక్కిన సినిమా కెన్నెడీ. ఈ సినిమాను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు చిత్రయూనిట్ పాల్గొంది. సన్నీతో పాటు ఆమె భర్త డానియల్ వెబర్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు.

  • Published On : May 26, 2023 / 10:05 AM IST

Sunny Leone and her husband emotional post on Sunny Leone debut at Cannes Film Festival

Cannes 2023 :  ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇప్పుడు ఇండియాలో(India) నటిగా బిజీ అయింది సన్నీలియోన్(Sunny Leone). అయితే ఈ ప్రయాణంలో అనేక బెదిరింపులు, అడ్డంకులు ఎదుర్కొంది. వీటన్నిటిని దాటుకొని ఇప్పుడున్న స్టేజికి వచ్చింది సన్నీలియోన్. ప్రస్తుతం సన్నీ లియోన్ నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. తాజాగా సన్నీలియోన్ ఫ్రాన్స్ లో జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో పాల్గొంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ జంటగా తెరకెక్కిన సినిమా కెన్నెడీ. ఈ సినిమాను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు చిత్రయూనిట్ పాల్గొంది. సన్నీతో పాటు ఆమె భర్త డానియల్ వెబర్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్ పై సన్నీ లియోన్, రాహుల్ భట్, అనురాగ్ కశ్యప్ సందడి చేశారు. ప్రదర్శన అనంతరం సన్నీ లియోన్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. పోర్న్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఇండియన్ సినీ పరిశ్రమలో నటిని అయ్యాను. ఎన్నో సినిమాల కష్టం తర్వాత ఇప్పుడు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సార్ వల్ల ఇక్కడ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వరకు రాగలిగాను. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలిపింది సన్నీలియోన్. కాన్స్ రెడ్ కార్పెట్ పై సన్నీ లియోన్ ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా గర్వంగా ఉంది అని పోస్ట్ చేసింది.

Aamir Khan : మరోసారి అమీర్ – ఫాతిమాపై రూమర్లు.. అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటాడా?

ఇక సన్నీ భర్త డానియల్ వెబర్ రెడ్ కార్పెట్ పై నడిచిన సన్నీ లియోన్, కెన్నెడీ చిత్ర యూనిట్ ఫొటోలని షేర్ చేస్తూ.. మాటలు రావట్లేదు. నా కళ్ళ ముందు ఓ సరికొత్త చరిత్ర జరిగింది. మనందరం జర్నీ చేస్తాం, కానీ అందరం కలలను సాకారం చేసుకోలేము. నువ్వు చాలా మందికి ఆదర్శం అవుతావు, థ్యాంక్యూ సన్నీ అని ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అలాగే కెన్నెడీ చిత్రయూనిట్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. డానియల్ వెబర్ పోస్ట్ చేసిన దానికి సన్నీ లియోన్ రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ మై లవ్. ఇది నా ఒక్కదాని మూమెంట్ కాదు, మన మూమెంట్. నేను ఈ స్టేజి వరకు రావడానికి నువ్వు కూడా ఎంతో కష్టపడ్డావు, నాకు సపోర్ట్ ఇచ్చావు అని పోస్ట్ చేసింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సన్నీలియోన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.