Aamir Khan : మరోసారి అమీర్ – ఫాతిమాపై రూమర్లు.. అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటాడా?

గత కొంతకాలంగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి, నటి ఫాతిమా సనాతో అమీర్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఫాతిమా అమీర్ తో కలిసి దంగల్ సినిమాలో నటించింది.

Aamir Khan : మరోసారి అమీర్ – ఫాతిమాపై రూమర్లు.. అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటాడా?

Aamir Khan will marry third time with actress Fatima sana?

Updated On : May 26, 2023 / 9:37 AM IST

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. వరుస ఫ్లాప్స్ తో కొంచెం గ్యాప్ తీసుకొని గత సంవత్సరం లాల్ సింగ్ చద్దా(Laal Singh Chaddha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో కొన్నాళ్ళకు సినిమాలకు బ్రేక్ ప్రకటించాడు అమీర్ ఖాన్. ప్రస్తుతం అమీర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అమీర్ ఖాన్ మొదట రీనా దత్తని పెళ్లి చేసుకొని విడిపోయారు. అనంతరం నిర్మాత కిరణ్ రావు(Kiran Rao)ని పెళ్లి చేసుకొని రెండేళ్ల క్రితమే విడిపోయారు. వారితో విడిపోయినా ఫ్రెండ్స్ గా, సినిమా పార్ట్నర్స్ గా కొనసాగుతూనే ఉన్నాడు అమీర్.

గత కొంతకాలంగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి, నటి ఫాతిమా సనాతో అమీర్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఫాతిమా అమీర్ తో కలిసి దంగల్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఫాతిమా అమీర్ ఖాన్ కు కూతురి పాత్రలో నటించడం విశేషం. గత కొన్నాళ్ల నుంచి వీరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి పికెల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించారు.

Mahesh Babu : మహేశ్ కార్ డ్రైవింగ్.. వెనకపడ్డ పోలీసులు.. మహేశ్‌లో ఆ టాలెంట్ ఉందా? మహేశ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన బాబాయ్..

ముంబైలోని ఓ ప్రైవేట్ స్పేస్ లో వీరిద్దరూ కలిసి గేమ్ ఆడుతూ కనిపించారు. ఇటీవల అమీర్, ఫాతిమా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటాడా? ఫాతిమాను అమీర్ వివాహం చేసుకుంటాడా అనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)