Trimukha
Trimukha : అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రజేశ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. సన్నీలియోన్ మెయిన్ లీడ్ లో యోగేష్ కల్లే, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Trimukha)
త్రిముఖ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. హిందీ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కించగా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు 10 కోట్లు బడ్జెట్ అనుకోగా ఇప్పుడు 14 కోట్లు బడ్జెట్ అయింది. చిన్న సినిమాకు భారీగానే ఖర్చుపెడుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Aakash Srinivas : OG లో పవన్ చిన్నప్పటి పాత్ర చేసింది ఇతనే.. అప్పుడు ప్రభాస్ కి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి..
తాజాగా ఈ సినిమా నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు రజేశ్ నాయుడు గారి దర్శకత్వంలో, మా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో త్రిముఖ సినిమా బాగా రూపుదిద్దుకుంది. మేము మొదట అనుకున్న దానికంటే భారీగా సినిమా రాబోతుంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు టీయూకు రాబోతున్నాం అని తెలిపారు.