Aakash Srinivas : OG లో పవన్ చిన్నప్పటి పాత్ర చేసింది ఇతనే.. అప్పుడు ప్రభాస్ కి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి..
పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అకిరా నందన్ చేస్తాడేమో అని పలువురు భావించారు. (Aakash Srinivas)

Aakash Srinivas
Aakash Srinivas : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వస్తుంది. OG సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంది. జపాన్ లో సమురాయ్ లతో ఉండే పవన్ ఇండియాకు ఎలా వచ్చాడు అనే కథతో సినిమా మొదలవుతుంది.(Aakash Srinivas)
పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అకిరా నందన్ చేస్తాడేమో అని పలువురు భావించారు. కానీ ఈ పాత్ర చేసింది ఆకాష్ శ్రీనివాస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు ఆకాష్. గతంలో రంగరంగ వైభవంగా, మళ్ళీ మొదలైంది, నాంది, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీశ్, బంగార్రాజు, రామారావు ఆన్ డ్యూటీ, పొన్నియన్ సెల్వన్.. ఇలా పలు సినిమాల్లో నటించాడు. కల్కి సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్ర కూడా ఇతనే నటించాడు. కల్కి సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఆకాష్.
Also See : Priyanka Mohan : OG సినిమా.. హీరోయిన్ ప్రియాంక మోహన్ వర్కింగ్ స్టిల్స్..
ఇప్పుడు OG సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. జపాన్ విద్యలతో ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా చేసాడు. దీంతో ఈ సినిమాతో ఆకాష్ మరింత వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఆకాష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు OG సక్సెస్ తో. సోషల్ మీడియాలో ఆకాష్ OG సమయంలో మూవీ టీమ్ తో దిగిన పాల ఫోటోలను కూడా షేర్ చేసి సినిమా వర్కింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు.
Also Read : Nikhil Siddhartha : OG హిట్ అవుతుందని 2008 లోనే చెప్పిన నిఖిల్.. వీడియో వైరల్..