Nikhil Siddhartha : OG హిట్ అవుతుందని 2008 లోనే చెప్పిన నిఖిల్.. వీడియో వైరల్..
ఈ సినిమా హిట్ అవుతుందని నేను 2008 లోనే చెప్పానంటూ హీరో నిఖిల్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసాడు. (Nikhil Siddhartha)

Nikhil Siddhartha
Nikhil Siddhartha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయి దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అయితే ఈ సినిమా హిట్ అవుతుందని నేను 2008 లోనే చెప్పానంటూ హీరో నిఖిల్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసాడు.(Nikhil Siddhartha)
హీరో నిఖిల్ 2008 లో యువత అనే ఓ సినిమా చేసాడు. ఆ సినిమాలో నిఖిల్, అతని ఫ్రెండ్స్ సరదాగా కూర్చొని మందు తాగుతూ ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నిఖిల్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి విలన్ తల నరికేస్తాడు. అంతే ఇంటర్వెల్ అని సరదాగా ఓ స్టోరీ చెప్తాడు. దానికి నిఖిల్.. ఈ సీన్ కనక పవన్ కళ్యాణ్ కి పడితే సంవత్సరం ఆడుద్ది సినిమా అంటాడు.
Also Read : OG Comic Book : పవన్ కళ్యాణ్ OG కామిక్ బుక్ వచ్చేసింది.. ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..
ఇప్పుడు OG సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఓ విలన్ తల నరికేయడంతో ఇంటర్వెల్ పడుతుంది. దీంతో ఈ వీడియోని నిఖిల్ షేర్ చేసి.. నేను ఎప్పుడో 2008 లోనే చెప్పాను. ఈ సీన్ పడితే సినిమా బ్లాక్ బస్టర్ అని. యువత సినిమాలోనే OG గురించి చెప్పాము అంటూ పోస్ట్ చేసాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పవన్ ఫ్యాన్స్ నిజమే కదా పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ పవర్ ఫుల్ సీన్ ఇదే మొదటిసారి పడటం అని అంటున్నారు.
మీరు కూడా ఆ వీడియో చూసేయండి..
View this post on Instagram
Also Read : Chiranjeevi : చరణ్ బాబు అంటూ.. కొడుకుపై గర్వంతో నాన్నగా మెగాస్టార్ స్పెషల్ పోస్ట్..